Naveen Polishetty emotional comments at 'Anaganaga Oka Raju' movie event.
Naveen Polishetty: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు నవీన్ పోలిశెట్టి. ఇండస్ట్రీలో చాలా కాలం నుంచే ఉన్నప్పటికీ సరైన అవకాశం దొరకలేదు. కానీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తన టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ఆ తరువాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ ఒక్క సినిమాతో నవీన్ పోలిశెట్టి కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే, తన నెక్స్ట్ సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ హీరో నటించిన గత చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పిల్లిశెట్టి’. స్టార్ బ్యూటీ అనుష్క హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై మంచి విజయం సాధించింది.
అంటే దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) చేస్తున్న కొత్త సినిమా అనగనగ ఒకరాజు.దర్శకుడు మారీ తెరకెక్కిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తన సినిమాలు ఎందుకు లేట్ అవుతాయి అనేది వివరించాడు.
‘నా సినిమాలు ఎక్కువ టైమ్ తీసుకోవచ్చు. కానీ దానికి ఒక కారణం ఉంది. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ సినిమాకి వెళ్దాం అంటే.. టికెట్ రూ.400 రూపాయలు అని తెలిసి భయపడేవాడిని. సినిమా బాగోలేకపోతే డబ్బులు వృథా అవుతాయని ఫీల్ అయ్యేవాడిని. అందుకే, ఆ సినిమా నేను ఆల్రెడీ చూశాను అని అబద్దం చెప్పేవాడిని. ఎందుకంటే, ఆ రూ.400 నాకు చాలా విలువైనవి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు నవీన్ పోలిశెట్టి. దీంతో ఈ హీరో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఈమాటలకి నెటిజన్స్ నవీన్ పోలిశెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.