Naveen Polishetty Helped to A Restaurant Server Revealed in Unstoppable Show
Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి సినిమా కష్టాలు చాలా పడి షార్ట్ ఫిలిమ్స్, క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇప్పుడు హీరోగా ఎదిగి దూసుకుపోతున్నాడు. ఇటీవల యాక్సిడెంట్ అవ్వడంతో కొంత గ్యాప్ తీసుకున్న నవీన్ తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ షోలో శ్రీలీలతో కలిసి సందడి చేసాడు.
బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆరో ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గతంలో నవీన్ పోలిశెట్టి హెల్ప్ చేసిన ఓ వ్యక్తి మాట్లాడిన వీడియోని బాలయ్య షోలో చూపించారు. అతని పేరు సమీర్. సమీర్ మాట్లాడుతూ.. ఒక రెస్టారెంట్ లో జాబ్ చేసేవాడ్ని, జాబ్ పోయింది. బిజినెస్ మొదలుపెట్టాను. అది కూడా ఫెయిల్ అయింది. నా భార్య కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. కరోనా సమయంలో అన్ని కోల్పోయి డిప్రెషన్ లో ఉన్నాను. అప్పుడు నవీన్ పోలిశెట్టి గారు కాల్ చేసి నాకు ఫుడ్ పెట్టారు, నా రెంట్ కట్టారు. నాకు జాబ్ కూడా ఇప్పించారు. ఇప్పుడు ఓ హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను. అంతా నవీన్ గారి వల్లే అని థ్యాంక్స్ చెప్పాడు.
Also Read : Pushpa 3 : పుష్ప 3 ఇప్పట్లో లేనట్టేనా.. ఆరేళ్ళ తర్వాతేనా..?
అతనికి చేసిన హెల్ప్ పై నవీన్ పోలిశెట్టి స్పందిస్తూ.. నాకు సక్సెస్ వచ్చేముందు నా లైఫ్ కూడా ఇలాగే ఉండేది. నేను ఒక రెస్టారెంట్ కి తినడానికి వెళ్తే అక్కడ ఇతను చాలా కష్టపడటం చూసాను. అందరికి బాగా సర్వ్ చేస్తున్నాడు. అతని వర్క్ నచ్చి ఫోన్ నంబర్ నేనే అడిగి తీసుకున్నా. ఒక వన్ ఇయర్ తర్వాత కరోనా సమయంలో ఖాళీగా ఉండి ఊరికే ఫోన్ చేస్తే తన సమస్యలు చెప్పాడు. దాంతో నాకు తోచిన హెల్ప్ చేశాను, అతనే కష్టపడి మేనేజర్ స్థాయికి ఎదిగాడు అని తెలిపారు. దీంతో అభిమనులు, నెటిజన్లు నవీన్ పోలిశెట్టిని అభినందిస్తున్నారు.