Pushpa 3 : పుష్ప 3 ఇప్పట్లో లేనట్టేనా.. ఆరేళ్ళ తర్వాతేనా..?
పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉండబోతుందని ప్రకటించారు మేకర్స్.

Allu Arjun pushpa 3 to release after six years
Pushpa 3 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సహా పుష్ప 2 మూవీ టీమ్ మొత్తం ప్రస్తుతం పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సక్సెస్ తో మూవీ టీమ్ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. విడుదల ముందు నుండే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప 2 విడుదల తర్వాత కూడా రికార్డ్స్ మోత మోగిస్తుంది.
ఇకపోతే పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉండబోతుందని ప్రకటించారు మేకర్స్. ‘పుష్ప 3 ది రాంపేజ్’ పేరుతో సీక్వెల్ రాబోతుంది. పుష్ప 2 సినిమా క్లైమాక్ లో సైతం పుష్ప 3 కి సంబందించిన హింట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పుడు పుష్ప 3 ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేసి రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు సినీ ఆడియన్స్. పుష్ప వచ్చిన మూడేళ్ళ తర్వాత పుష్ప 2 వచ్చింది. ఇక ఇప్పుడు 3 కూడా ఆ గ్యాప్ లోనే వస్తుందని అనుకునే లోపే మరో షాకింగ్ విషయం తెలిసింది. ఏంటంటే..పుష్ప 3కి పుష్ప 2 కి పట్టిన సమయం కంటే ఎక్కువ సమయం పడుతుందట.
Also Read : Sandeep Raj : ఘనంగా కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ వివాహం..
అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప 3 రావడానికి మరో 6 సంవత్సరాల కంటే ఎక్కువ సమయమే పడుతుంది అంటున్నారు. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఒప్పుకున్న పలు సినిమాలు ఉన్నాయట. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక సినిమా అనౌన్స్ చేసాడు. అలాగే సందీప్ రెడ్డి వంగతో కూడా ఓ సినిమా ఉంది. అట్లీతో కూడా ఓ సినిమా ఉందని రూమర్ వినిపిస్తుంది. అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా పూర్తి చెయ్యాల్సిన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయట. సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. అందుకే పుష్ప కి కాస్త బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట మేకర్స్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఇదే నిజమని అంటున్నారు. మరి పుష్ప 3 ఎప్పుడు వస్తుందో చూడాలి.