Naveen Polishetty To Join Hands With Swathimuthyam Director
Naveen Polishetty: ‘జాతిరత్నాలు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో నవీన్ పోలిశెట్టి, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Naveen Polishetty: కామెడీ చేస్తానంటోన్న పోలిశెట్టి పిల్లగాడు!
ఇక ఈ సినిమా తరువాత ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. కాగా, ఇప్పుడు మరో డైరెక్టర్‌తో నవీన్ పోలిశెట్టి చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘స్వాతిముత్యం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ నవీన్ పోలిశెట్టి కోసం ఓ కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కథను నవీన్‌కు వినిపంచగానే, ఆయన ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
లక్ష్మణ్ కృష్ణ ఓ కామెడీ కథను నవీన్‌కు వినిపించగా, ఈ సినిమా కథ ఆయనకు బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో నిజంగానే సినిమా సెట్ అయితే అది ఖచ్చితంగా కామెడీ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే స్వాతిముత్యం డైరెక్టర్‌తో నవీన్ పోలిశెట్టి సినిమా చేస్తాడా లేడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.