Naveen Polishetty: కామెడీ చేస్తానంటోన్న పోలిశెట్టి పిల్లగాడు!

‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన నెక్ట్స్ సినిమాను ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే నవీన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మహేష్ బాబు అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.

Naveen Polishetty: కామెడీ చేస్తానంటోన్న పోలిశెట్టి పిల్లగాడు!

Naveen Polishetty As Stand-Up Comedian In His Next Movie

Updated On : December 27, 2022 / 1:30 PM IST

Naveen Polishetty: ‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన నెక్ట్స్ సినిమాను ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే నవీన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మహేష్ బాబు అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.

Naveen polishetty : ఒకప్పుడు ఇక్కడే పాసులు లేక ఈవెంట్స్ లోపలికి రానివ్వలేదు.. ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా వచ్చా..

ఇక ఇప్పటికే ఈ సినిమాలో అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా నవీన్ పోలిశెట్టి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో సిధ్ధు పోలిశెట్టి అనే పాత్రలో నవీన్ కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మనోడు స్టాండప్ కామెడీ చేసే పాత్రలో నటిస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అటు అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తుండటంతో, వీరిద్దమరి మధ్య లవ్ ఎలా క్రియేట్ అవుతుందనే పాయింట్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నారట చిత్ర యూనిట్.

యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.