Sai Dharam Tej : తేజ్ బైక్ యాక్సిడెంట్‌తో.. తన షెడ్‌లో ఉన్న బైక్స్ అన్ని అమ్మేసిన నరేష్ కొడుకు నవీన్..

యాక్సిడెంట్‌ అయిన తరువాత సాయి ధరమ్ తేజ్ ని హాస్పిటల్ బెడ్ పైన చూసిన సీనియర్ హీరో నరేష్ కొడుకు నవీన్.. తన షెడ్‌లో ఉన్న బైక్స్ అన్ని అమ్మేశాడట. ఇంతకీ తేజ్ అండ్ నవీన్..

Sai Dharam Tej : తేజ్ బైక్ యాక్సిడెంట్‌తో.. తన షెడ్‌లో ఉన్న బైక్స్ అన్ని అమ్మేసిన నరేష్ కొడుకు నవీన్..

Naveen Vijaya Krishna sold all his bikes after Sai Dharam Tej accident

Updated On : August 24, 2023 / 4:14 PM IST

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే. హైదరాబాద్ లోని రోడ్డుపై ఇసుకు వల్ల ప్రమాదానికి గురయ్యి.. కోమా స్టేజి వరకు వెళ్లి కోలుకొని తిరిగి వచ్చాడు. ఆ ప్రమాదంతో మెగా ఫ్యామిలీ చాలా భయపడిపోయింది. మెగాభిమానులు కూడా ఎంతో ఆందోళన చెందారు. ఇటీవల బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కూడా ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో హాస్పిటల్ లో ఒక మూలన కూర్చొని ఏడ్చినట్లు చెప్పుకొచ్చాడు.

Naveen Vijaya Krishna : విజయ్ నిర్మల కోరిన ఏకైక కోరిక.. అందుకే హీరోగా ఎంట్రీ..

ఇది ఇలా ఉంటే, ఆ సమయంలో యాక్సిడెంట్ కి సీనియర్ హీరో నరేష్ (Naresh) కొడుకు నవీన్ విజయ కృష్ణ (Naveen Vijaya Krishna) లింక్ చేస్తూ కొన్ని వార్తలు వచ్చాయి. నవీన్ అండ్ తేజ్ క్లోజ్ ఫ్రెండ్స్. నిత్యం కలుస్తూ ఉంటారు. నవీన్ దగ్గర మంచి మంచి బైక్ కలెక్షన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి బైక్ పై ఎవరికి కనబడకుండా చక్కర్లు కొడుతుంటారు. దీంతో యాక్సిడెంట్ సమయంలో ఇద్దరు కలిసి రేసింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై నవీన్ సమాధానం ఇచ్చాడు.

Neha Shetty : మొన్న తెలంగాణ వాళ్ళు కనెక్ట్ అయ్యారు.. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కనెక్ట్ అవుతారు.. స్టేజిపై స్పీచ్‌తో రెచ్చిపోయిన నేహశెట్టి..

ప్రతిసారి తేజ్ తన ఇంటి దగ్గర వదిలిన తరువాత నవీన్ ఇంటికి వెళ్లేవాడట. కానీ ఆ రోజు తేజ్ ఇక్కడే కదా వెళ్ళిపోతాను అని చెప్పి ఒంటరిగా వెళ్ళాడట. నవీన్ ఇంటికి రాగానే ఇలా న్యూస్ వచ్చింది. హాస్పిటల్ కి వెళ్లి తేజ్ ని ఆ పరిస్థితిలో చూసి నవీన్ చాలా బాధ పడ్డాడట. ఆ బాధలో ఉండగా టీవీ ఛానల్స్ ఇలా వేయడం ఇంకా బాధని కలిగించినట్లు చెప్పుకొచ్చాడు. తేజ్ పరిస్థితి చూసిన నవీన్ ఒక నిర్ణయం తీసుకోని.. తన షెడ్‌లో ఉన్న బైక్స్ అన్ని అమ్మేశాడట. ప్రస్తుతం తేజ్ హీరోగా నవీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సత్య’ (Satya) అనే ఫీచర్ ఫిలింతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.