Nayanathara comments on her Bollywood Entry
Nayanathara : 2003 లో మలయాళం సినిమాలతో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. అనంతరం తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ని కూడా తెచ్చుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న నయనతార ఇప్పటివరకు బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు.
ఇటీవలే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని, సరోగసి ద్వారా ఇద్దరి పిల్లలకి తల్లి కూడా అయింది నయన్. ప్రస్తుతం ఓ పక్క సినిమాలతో మరో పక్క ఫ్యామిలీతో బిజీగా ఉంది. సినీ పరిశ్రమకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత నయనతార బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. అది కూడా షారుఖ్ సరసన అని తెలిసిందే. షారుఖ్ సరసన అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా అదిరెక్టర్ తమిళ్ డైరెక్టర్ కావడం విశేషం. అట్లీ వల్లే నయన్ కి ఈ అవకాశం వచ్చిందని అందరికి తెలిసిందే.
LB Sriram : మళ్ళీ సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటున్న LB శ్రీరామ్..
తాజాగా తన బాలీవుడ్ ఎంట్రీ పై నయనతార కామెంట్స్ చేసింది. నయనతార నటించిన తమిళ్ హారర్ సినిమా కనెక్ట్ డిసెంబర్ 30న హిందీలో రిలీజయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నయన్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు నాకు హిందీలో సరైన అవకాశం రాలేదు. అందుకే ఇక్కడ సినిమాలు చేయలేదు. బాలీవుడ్ లో నాకు మంచి అవకాశం రావడానికి 20 ఏళ్ళు పట్టింది. గతంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇప్పుడు పాన్ ఇండియా వల్ల సినిమాలని వివిధ భాషల్లో రిలీజ్ చేయడానికి అందరూ ధైర్యం చేస్తున్నారు. ప్రతి దానికి ఓ సరైన సమయం ఉంటుంది. అందుకే నా బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు రాసుంది అనుకుంట అని తెలిపింది.