LB Sriram : మళ్ళీ సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటున్న LB శ్రీరామ్..

తాజాగా నూతన సంవత్సరం మొదటి రోజున తన ట్విట్టర్ లో ఓ ఆశ్చర్యకరమైన పోస్ట్ పెట్టారు ఎల్బీ శ్రీరామ్. ఓ పసుపు రంగు కలర్ ఫుల్ చొక్కా వేసుకొని, కింద నిక్కర్ వేసుకొని సరదాగా ఉన్న ఫోటోని షేర్ చేసి...........

LB Sriram : మళ్ళీ సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటున్న LB శ్రీరామ్..

LB Sriram wants to busy again in films

LB Sriram :  1990లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎల్బీ శ్రీరామ్ మంచి కమెడియన్ గా ఎదిగారు. దాదాపు 150కి పైగా సినిమాలో కమెడియన్ గా ప్రేక్షకులని నవ్వించారు. మధ్యమధ్యలో అమ్మో ఒకటో తారీఖు లాంటి సినిమాలు చేసి ఏడిపించి ఇలాంటి సీరియస్ పాత్రలు కూడా చేయగలను అని తెలియచేశారు. అలాగే పలు సినిమాలకి రచయితగా కూడా పనిచేశారు. గత మూడేళ్ళుగా సినిమాల్లో పెద్దగా కనపడట్లేదు. ఎప్పుడో ఏదైనా క్యారెక్టర్ దానంతట అదే వస్తే తప్ప ఈ మూడేళ్ళలో అసలు సినిమాల్లో కనిపించలేదు.

ఒక రెండేళ్ల క్రితం కరోనా ముందు ఎల్బీ శ్రీరామ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని సరికొత్తగా స్టార్ట్ చేశారు. యూట్యూబ్ లో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథలతో షార్ట్ ఫిలిమ్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ ని ఆయనే మెయిన్ లీడ్ గా తెరకెక్కించారు. అందులో కొన్ని ఆయనే రచించారు కూడా. ఈ షార్ట్ ఫిలిమ్స్ కి మంచి పేరు వచ్చింది. చాలా మంది అభిమానులు ఉన్నారు ఈ షార్ట్ ఫిలిమ్స్ కి. దీంతో ఎల్బీ శ్రీరామ్ ప్రస్తుతం ఈ మెసేజ్ ఓరియెంటెడ్ షార్ట్ ఫిలిమ్స్ నే చేస్తున్నారు.

Rajayogam Movie : మా సినిమా చూస్తే లక్ష రూపాయల బహుమతి.. కానీ ఒక కండిషన్..

తాజాగా నూతన సంవత్సరం మొదటి రోజున తన ట్విట్టర్ లో ఓ ఆశ్చర్యకరమైన పోస్ట్ పెట్టారు ఎల్బీ శ్రీరామ్. ఓ పసుపు రంగు కలర్ ఫుల్ చొక్కా వేసుకొని, కింద నిక్కర్ వేసుకొని సరదాగా ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా ఏదైనా చేద్దాం. నేను సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కొత్త కుర్రాణ్ణి కనక కుర్రవేషాలేస్తున్నా!” అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ కి నెటిజన్లు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇండైరెక్ట్ గా మళ్ళీ సినిమాల్లో కనిపించబోతున్నారు, ట్రై చేస్తారు అని తెలిపారా అని ఆలోచిస్తున్నారు. 70 ఏళ్ళ వయసులో కూడా ఇంకా చలాకీగా పనిచేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ఎల్బీ శ్రీరామ్.