Rajayogam Movie : మా సినిమా చూస్తే లక్ష రూపాయల బహుమతి.. కానీ ఒక కండిషన్..

సాయి రోనక్ హీరోగా అంకిత సాహా, బిస్మి నాస్ హీరోయిన్స్ గా కొత్త దర్శకుడు రామ్ గణపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాజయోగం. ఇటీవల డిసెంబర్ 30న థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా..........

Rajayogam Movie : మా సినిమా చూస్తే లక్ష రూపాయల బహుమతి.. కానీ ఒక కండిషన్..

Rajayogam Movie announced one lakh rupees gift to audience for watching movie with one condition

Rajayogam Movie :  అప్పుడప్పుడు కొంతమంది సినిమా వాళ్ళు తమ సినిమా చూస్తే ఏదొక బహుమతి ఇస్తాం అని ప్రకటిస్తూ ఉంటారు. లేదా హీరో, హీరోయిన్స్ ని కలవచ్చు అని, లక్కీ డ్రా అని తమ సినిమాని మరింత ప్రమోట్ చేసుకోవడానికి ఇలా కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఓ చిత్ర యూనిట్ తమ సినిమాని చూస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించింది. అయితే ఓ కండిషన్ పెట్టింది.

సాయి రోనక్ హీరోగా అంకిత సాహా, బిస్మి నాస్ హీరోయిన్స్ గా కొత్త దర్శకుడు రామ్ గణపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాజయోగం. ఇటీవల డిసెంబర్ 30న థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమా ఫుల్ కామెడీగా ఉందని, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు.

Mahesh Babu Foundation : మహేష్ బాబు ఫౌండేషన్ మరో ముందడుగు.. మహేష్ ఫౌండేషన్ కోసం సితార విరాళం..

తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ లో దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ.. మా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. చూపు తిప్పుకోకుండా సినిమా చూశామని ప్రేక్షకులు చెప్తున్నారు. చాలా మంది ఈ సినిమాని అభినందిస్తున్నారు. సినిమా చూడని వాళ్ళు ఉంటే థియటర్ కి వెళ్లి సినిమా చూడండి. అలాగే సినిమా చూసి, చూసేటప్పుడు నవ్వకుండా ఉంటే లక్ష రూపాయల బహుమతిని ఇస్తాం అని ప్రకటించారు. మరి ఆ లక్ష రూపాయలు ఎవరు గెలుచుకుంటారో చూడాలి.