Nayanathara : అందరి ముందు షారుఖ్ కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరోయిన్..

షారుఖ్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రయాణంలో షారుఖ్ నయనతార ఫ్యామిలీకి మంచి స్నేహితుడయ్యాడు. నయన్ పెళ్ళికి కూడా షారుఖ్ వచ్చి సందడి చేశాడు. తాజాగా షారుఖ్ చెన్నైకి రావడంతో నయన్ ఇంటికి వెళ్ళాడు...............

Nayanathara : అందరి ముందు షారుఖ్ కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరోయిన్..

Nayanathara gives kiss to shahrukh khan in public

Updated On : February 13, 2023 / 7:08 AM IST

Nayanathara :  నయనతార ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుస సినిమాలు చేస్తుంది. ఓ పక్క లేడీ సూపర్ స్టార్ గా ఎక్కువ వుమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మరోపక్క స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం షారుఖ్ తో బాలీవుడ్ లో జవాన్ సినిమా చేస్తోంది. ఈ సినిమా నయనతారకు మొదటి డైరెక్ట్ బాలీవుడ్ సినిమా.

షారుఖ్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రయాణంలో షారుఖ్ నయనతార ఫ్యామిలీకి మంచి స్నేహితుడయ్యాడు. నయన్ పెళ్ళికి కూడా షారుఖ్ వచ్చి సందడి చేశాడు. తాజాగా షారుఖ్ చెన్నైకి రావడంతో నయన్ ఇంటికి వెళ్ళాడు. నయన్, విగ్నేష్ శివన్ లతో కాసేపు సమయం గడిపి షారుఖ్ బయలుదేరాడు.

Ram Charan : సచిన్, ఆనంద్ మహీంద్రా, KTRతో కలిసి.. ఫార్ములా E రేస్ లో రామ్ చరణ్ సందడి..

షారుఖ్ వెళ్ళేటప్పుడు బయట చాలా మంది జనాలు పోగయ్యారు. నయనతార కారు దాకా వచ్చి షారుఖ్ కి వీడ్కోలు తెలిపింది. ఈ నేపథ్యంలో షారుఖ్ కారు ఎక్కేముందు నయనతార షారుఖ్ బుగ్గపై ముద్దిచ్చింది. షారుఖ్ నయన్ ని దగ్గరికి తీసుకొని గుడ్ బాయ్ చెప్పాడు. దీంతో నయనతార షారుఖ్ కి ముద్దు ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది అభిమానులు, నెటిజన్లు నయన్ షారుఖ్ కి అలా ముద్దివ్వడాన్ని తప్పు పడుతుంటే, కొంతమంది మాత్రం ఇది చాలా కామన్, వెళ్ళేటప్పుడు ఆప్యాయతగా ముద్దు పెట్టుకున్నారు, ప్రేమగా హత్తుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి నయన్ షారుఖ్ కి కిస్ ఇచ్చిన వీడియో మాత్రం ఇప్పుడు ట్రెండ్ లో ఉంది.