Nayanthara – Vignesh: నయనతార పేరు మార్చుకుంది.. పెళ్లికి రెడీ అయ్యారా..?

రీసెంట్‌గా నయనతార ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పేరు పక్కన విక్కీ అంటూ విఘ్నేష్ పేరు యాడ్ చేసింది.. దీంతో పెళ్లి ఫిక్స్ అంటూ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది..

Nayanthara And Vignesh Shivan Marriage Date Fix

Nayanthara – Vignesh Shivan: బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్, రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత సెలబ్రిటీల పెళ్లి విషయంలో అంత బాగా వినిపించే పేరు నయనతార.. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్న నయన్.. శింబుతో ప్రేమాయణం, తర్వాత ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లింది..

Nayanthara – Vignesh Shivan : ప్రియుడితో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్న న‌య‌న‌తార‌..

రీసెంట్‌గా నయనతార ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పేరు పక్కన విక్కీ అంటూ విఘ్నేష్ పేరు యాడ్ చేసింది. దీంతో పెళ్లి ఫిక్స్ అంటూ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. కొద్ది కాలంగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో రిలేషన్‌లో ఉంది నయన్. ఇప్పటికే వీళ్ల పెళ్లి గురించి చాలా సార్లు వార్తలు వచ్చాయి. మాకు మీడియా 22 సార్లు పెళ్లి చేసేసిందని చెప్తూ నయన్ ప్రియుడు విఘ్నేష్ రీసెంట్‌గా ఓ తమిళ్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.

పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ప్రస్తుతం ఇద్దరం ఎవరి ప్రెఫెషన్‌లో వాళ్లం బిజీగా ఉన్నాం. పెళ్లి డేట్ ఫిక్స్ అయితే ఫస్ట్ మీకే చెప్తాం అన్నాడు. ఇటీవల ‘నిజాల్’ అనే మలయాళ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార ‘నెట్రికన్’ అనే మూవీలో అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది.. విఘ్నేశ్ శివన్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు..