Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లోని 107వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి తనదైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
NBK108 Movie: బాలయ్య నెక్ట్స్ మూవీ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది!
ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే, బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను సరికొత్త కాన్సెప్ట్‌తో అనిల్ రావిపూడి రూపొందించనుండగా, ఈ సినిమాలో బాలయ్య ఓ వైవిధ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ హీరోయిన్ కూడా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.
Balakrishna: బాలయ్య కోసం రెడీ అవుతున్న యంగ్ డైరెక్టర్..?
అయితే ఈ సినిమాలో మరోసారి బాలయ్య పక్కన నయనతారను తీసుకునేందుకు అనిల్ రావిపూడి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్య సరసన నయనతార బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి బాలయ్య సరసన నయనతార నటిస్తుందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి నిజంగానే బాలయ్య సరసన మరోసారి నయనతార నటిస్తుందా లేదా అనేది అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.