Balakrishna: బాలయ్య కోసం రెడీ అవుతున్న యంగ్ డైరెక్టర్..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా బాలయ్య నెక్ట్స్ మూవీకి దర్శకుడు దొరికాడని సినీ వర్గాల్లో ఓ టాక్ జోరుగా వినిపిస్తోంది.

Balakrishna: బాలయ్య కోసం రెడీ అవుతున్న యంగ్ డైరెక్టర్..?

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 107వ చిత్రంగా ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ ఏమిటా అని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

NBK107: బాలయ్య సినిమా టైటిల్.. ఆ రోజున వచ్చేస్తుందా?

కాగా బాలయ్య నెక్ట్స్ మూవీకి దర్శకుడు దొరికాడని సినీ వర్గాల్లో ఓ టాక్ జోరుగా వినిపిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ చిత్రంతో తన సత్తా ఏమిటో చాటుకున్నాడు దర్శకుడు వశిష్ఠ. తొలి సినిమా అయినా కూడా ఈ చిత్రాన్ని అతడు హ్యాండిల్ చేసిన విధానం సూపర్బ్‌గా ఉండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. కాగా ఈ డైరెక్టర్‌ను బాలయ్య నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు తీసుకోవాలని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Balakrishna : అభిమాని కుటుంబాన్ని పిలిచి భోజనం పెట్టిన బాలయ్య.. వైరల్ గా మారిన వీడియో

గతంలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో చేస్తున్నప్పుడు గీతా ఆర్ట్స్‌తో ఓ సినిమా చేసేందుకు ఆయన రెడీ అయినట్లుగా.. అయితే ఇంతకాలం ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే బాధ్యతలను ఎవరికి ఇవ్వాలా అని గీతా ఆర్ట్స్ ఎదురుచూస్తున్న తరుణంలో.. బింబిసార వంటి ప్రెస్టీజియస్ మూవీని రూపొందించిన వశిష్ఠ అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా సరిపోతాడని వారు భావిస్తున్నారట. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ ఉండవచ్చని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా బింబిసార చిత్రంతో సత్తా చాటిన వశిష్ఠ, బాలయ్య కోసం ఎలాంటి కథను పట్టుకొస్తాడో చూడాలి అంటున్నారు నందమూరి అభిమానులు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.