NBK107: బాలయ్య సినిమా టైటిల్.. ఆ రోజున వచ్చేస్తుందా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ చిత్ర టైటిల్‌ను రాఖీ పండుగ రోజున రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

NBK107: బాలయ్య సినిమా టైటిల్.. ఆ రోజున వచ్చేస్తుందా?

NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తూ తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. కాగా, ఇప్పటివరకు ఈ సినిమా నుండి పోస్టర్స్, టీజర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయకపోవడంతో బాలయ్య సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

NBK107: బాలయ్య అభిమానులకు ఈఏడాది లేనట్టే..?

అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో దీనికి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బాలయ్య సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని.. ఈ టైటిల్ ను ఈ నెలలో వచ్చే రాఖీ పండుగ రోజున రివీల్ చేయబోతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బాలయ్య మాస్ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ టైటిల్ ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడని.. ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగులకు అభిమానులు విజిల్స్ వేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

NBK107: బాలయ్యను చూసి ఆగలేకపోయిన లేడీ ఫ్యాన్!

ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ అవతారం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. మరి బాలయ్య కెరీర్ లో తెరకెక్కుతున్న 107వ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారో తెలియాలంటే రాఖీ పండుగ వరకు ఆగాల్సిందే.