NBK107: బాలయ్యను చూసి ఆగలేకపోయిన లేడీ ఫ్యాన్!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో అక్కడ కోలాహలంగా మారింది. బాలయ్యను చూసిన ఆనందంలో ఓ లేడీ ఫ్యాన్ చేసిన పని ఇప్పుడు నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

NBK107: బాలయ్యను చూసి ఆగలేకపోయిన లేడీ ఫ్యాన్!
ad

NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూలులో జరుపుకుంటోంది.

NBK107: మరోసారి ‘జై బాలయ్య’తో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయ్!

అయితే ఈ షూటింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో అక్కడ కోలాహలంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో బాలయ్య షూటింగ్ స్పాట్ నుండి అనేక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తాజాగా బాలయ్యను చూసిన ఆనందంలో ఓ లేడీ ఫ్యాన్ చేసిన పని ఇప్పుడు నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వయసును మరిచి ఆమె జై బాలయ్య అంటూ చేస్తున్న డ్యాన్స్‌కు నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు.

NBK107: బాలయ్య సినిమా మధ్యలోనే సీట్లపై నుండి లేస్తారట!

మొత్తానికి బాలయ్య సినిమా షూటింగ్ స్పాట్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల జనం బాలయ్యను చూసేందుకు ఎగబడుతున్నారు. కాగా, సినిమాలోని ఓ పాటను ప్రస్తుతం అక్కడ షూటింగ్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.