NBK107: బాలయ్య సినిమా మధ్యలోనే సీట్లపై నుండి లేస్తారట!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను....

NBK107: బాలయ్య సినిమా మధ్యలోనే సీట్లపై నుండి లేస్తారట!

Nbk107 Interval Sequence To Be In Next Level Says Gopichand Malineni

NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గోపీచంద్ గత మూవీ ‘క్రాక్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఈసారి బాలయ్య కోసం అదిరిపోయే కథను రెడీ చేసినట్లుగా గోపీచంద్ పలుమార్లు చెప్పుకొచ్చాడు.

NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడగా, ఈ సినిమాలోని ఓ ఎపిసోడ్ గురించి చిత్ర యూనిట్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ సమయానికి ఆడియెన్స్ సీట్లలో కూర్చోరని చిత్ర యూనిట్ అంటోంది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. సినిమా మధ్యలోనే ఆడియెన్స్ సీట్లలో నుంచి ఎందుకు లేస్తారా అని వారు ఆలోచిస్తున్నారు. అయితే అసలు కథ వేరే ఉందని తీరిగ్గా చెబుతోంది చిత్ర యూనిట్.

NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?

ఈ సినిమాలో బాలయ్య ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని.. దాని ఇంట్రొడక్షన్ ఇంటర్వెల్ సమయంలో స్టార్ట్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఓపెనింగ్ సీక్వెన్స్ వచ్చేటప్పుడు బాలయ్య అభిమానులు ఎవరూ కూడా సీట్లలో కూర్చోరని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది. అంటే.. బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను ఎంత సాలిడ్‌గా తెరకెక్కించకపోతే, చిత్ర యూనిట్ ఈ స్థాయి ధీమా వ్యక్తం చేస్తుందని బాలయ్య అభిమానులు అంటున్నారు. అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.