NBK107: మరోసారి ‘జై బాలయ్య’తో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయ్!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలోని ఓ పాటను ఇక్కడ తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే ఓ సాంగ్‌ను ప్రస్తుతం చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.
NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలోని ఓ పాటను ఇక్కడ తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతోంది. ఇక అన్నట్లుగానే ప్రస్తుతం బాలయ్య సరికొత్త గెటప్‌లో మనకు కనిపిస్తున్నాడు.
NBK107: బాలయ్య సినిమా మధ్యలోనే సీట్లపై నుండి లేస్తారట!
ఇప్పటికే రిలీజ్ అయిన NBK107 ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్‌లో బాలయ్య లుక్ కాస్త ఏజ్డ్గా కనిపించగా, ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలయ్య యంగ్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే ఓ సాంగ్‌ను ప్రస్తుతం చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ‘జై బాలయ్య’ అనే సాంగ్ అని.. ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో అక్కడున్న కొందరు అభిమానులు తమ సెల్ ఫోన్లలో బంధించిన షూటింగ్ స్టిల్స్, వీడియోల ద్వారా తెలుస్తోంది.
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
గతంలో అఖండ చిత్రంలోనూ జై బాలయ్య పాట ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడు NBK107 సినిమాలోనూ ‘జై బాలయ్య’ అనే పాట ఉండటంతో ఈ పాట ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ పాట కూడా థియేటర్లలో దద్దరిల్లడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.