Nayanthara
Nayanthara : వాలంటైన్స్ డే రోజు స్టార్ కపుల్ నయనతార-విగ్నేష్ శివన్‌ల ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రేమతో నిండిపోయింది. ఈ జంట ముచ్చటైన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ramam Raghavam : నాన్నతోనే ఫస్ట్ లవ్.. ‘రామం రాఘవం’ ఎమోషనల్ గ్లిమ్స్..
లేడీ సూపర్ స్టార్ నయన తార తన భర్త విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు. వారిద్దరి ఫోటోలతో పాటు పిల్లలు ఉయిర్, ఉలగం ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు. వాలెంటైన్స్ డే సందర్భంగా నయనతార ఉయిర్, ఉలగం ఫోటోలను ‘ఐ లవ్ యు మై ఉయిర్, ఐ లవ్ యు మై ఉలగం.. నా వాలంటైన్స్ డేని మరింత అందంగా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ పోస్టు చేసారు. మరో పోస్టులో భర్త విగ్నేష్ ను ఉద్దేశించి ‘మీకు తెలియనంతగా ప్రేమిస్తున్నాను.. చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను.. నా ప్రేమను రోజు చూపిస్తున్నానని అనుకుంటున్నాను.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.. 10 సంవత్సరాల స్వచ్చమైన ప్రేమకు శుభాకాంక్షలు’ అంటూ పోస్టు పెట్టారు.
విగ్నేష్ శివన్ కూడా పోస్టు పెట్టారు. ప్రేమను నమ్మే అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.. అని విష్ చేస్తూ ‘మీరు నా ఉయిర్.. నేను మీ ఉలగం.. ఇప్పుడు ఉయిర్, ఉలగం మీరు, నేనుగా మారాము.. ముసలితనంలోనే కాదు రాబోయే జన్మలో కూడా మరెన్నో అందమైన క్షణాలను పంచుకోవాలి. లవ్ యూ.. సో మచ్ ఉయిర్’ అంటూ నయన్‌పై ప్రేమను కురిపించారు. నయనతార-విగ్నేష్ శివన్‌లు 2022 లో పెళ్లి చేసుకున్నారు. సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చారు. వారికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టారు. ఉయిర్ అంటే ప్రాణమని.. ఉలగం అంటే ప్రపంచమని అర్ధమట.
నయనతార ఇటీవల అన్నపూరణి అనే తమిళ సినిమాలో నటించారు. 2023 లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు నయనతార.