NBK 106 క్రేజీ అప్‌డేట్
NBK 106 : బాలయ్య, బోయపాటి సినిమా గురించిన రూమర్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

NBK 106 : బాలయ్య, బోయపాటి సినిమా గురించిన రూమర్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రానున్న సంగతి తెలిసిందే.. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలకు మించిన సినిమా ఇస్తా అని బాలయ్య అభిమానులకు ప్రామిస్ చేసిన బోయపాటి అందుకు తగ్గట్టుగానే కథా, కథనాలు రెడీ చేశాడట.. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న NBK 106కి సంబంధించి క్రేజీ అప్‌డేట్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలయ్య, బోయపాటి సినిమాలో పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నాడట.. హీరోయిన్లు.. ఒకరో, ఇద్దరో తెలియదు కానీ.. కన్నడ బ్యూటీ, ప్రస్తుతం కన్నడలో వరుసగా సినిమాలు చేస్తున్న రచితా రామ్.. బాలయ్య పక్కన ఆడిపాడనుందట.. అలాగే కోలీవుడ్ యంగ్ సెన్సేషన్, కొలవెరి కుర్రాడు అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడని ఫోటో షాప్‌లో రకరకాల థంబ్స్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు అభిమానులు, ఔత్సాహికులు..
Read Also : గురువు విగ్రహాన్ని ఆవిష్కరించిన శిష్యులు
ఇక ఈ సినిమాకు ‘రాజసం’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అంటూ బాలయ్య లుక్‌తో ఫ్యాన్స్ డిజైన్ చేసిన లుక్ కూడా బాగా వైరల్ అవుతోంది.. నవంబర్ లేదా డిసెంబర్‌లో.. బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్ ప్రారభం కానుంది. బాలయ్య 105వ సినిమా ‘రూలర్’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది..