Nbk107 Release Date Pushed To Sankranti
NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ NBK107 మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ ను చూపించడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే కూడా చాలా ఆలస్యంగా తెరకెక్కుతోండటంతో అభిమానులు ఈ మూవీ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఆతృతగా చూస్తున్నారు.
NBK107: బాలయ్యను చూసి ఆగలేకపోయిన లేడీ ఫ్యాన్!
ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఇటీవల కర్నూలులో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ షెడ్యూల్‌లో బాలయ్యకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే ఓ పాటను చిత్ర యూనిట్ చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన లుక్స్‌లో మనకు కనిపించబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే బాలయ్య నుండి ఏయే అంశాలు అభిమానులు కోరుతారో, వాటిని పక్కాగా చూపించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ గ్లింప్స్ వీడియోలు చూస్తే, ఈ సినిమాలో బాలయ్య పవర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది.
NBK107: మరోసారి ‘జై బాలయ్య’తో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయ్!
అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ తడబడుతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేయాలని చూసినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుందని భావించి, ఈ సినిమాను బాలయ్య బ్లాక్‌బస్టర్ మూవీ ‘అఖండ’ రిలీజ్ డేట్ అయిన డిసెంబర్ 2న రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తే, పండగ సీజన్ కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. కాగా ఇప్పటికే సంక్రాంతి బరిలో మెగా154 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు కర్చీఫ్ వేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీంతో సంక్రాంతి బరిలో మెగా వర్సెస్ నందమూరి వార్ ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.