KPS Malhotra Corona Positive: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరిగి, చివరికి డ్రగ్స్ మాఫియా బండారం బయటపడేంత వరకు దారి తీసింది. ఈ డ్రగ్స్ కేసులో హీరోయిన్ దీపికా పదుకొణెను విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారి కేపీఎస్ మల్హోత్రా కరోనా బారిన పడ్డారు.
ఎన్సీబీ అధికారి మల్హోత్రా, హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య కేసుతోపాటు డ్రగ్స్ కేసును విచారిస్తున్న సభ్యుల టీమ్‌లో ఉన్నారు. ఆయన కరోనా బారిన పడడంతో మిగతా సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీపిక, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారించిన సంగతి తెలిసిందే.