Bollywood Drugs Case : హీరోయిన్లు ఇరుక్కున్నారు.. సమన్లు జారీ చేసిన NCB

  • Published By: sekhar ,Published On : September 23, 2020 / 08:04 PM IST
Bollywood Drugs Case : హీరోయిన్లు ఇరుక్కున్నారు.. సమన్లు జారీ చేసిన NCB

Updated On : September 23, 2020 / 8:19 PM IST

Bollywood Drugs Case: ప్రస్తుతం బాలీవుడ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీలను కుదిపేస్తున్న ఈ డ్రగ్స్ వ్యవహారం త్వరలో టాలీవుడ్‌కి చేరుకునే అవకాశముందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్‌సీబీ తాజాగా సమన్లు అందించింది.


రకుల్, శ్రద్ధా, సారాలను గురువారం, దీపికను శుక్రవారం విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. వీరితో పాటు ఫ్యాషన్ డిజైనర్ సైమోన్‌ను కూడా విచారించబోతున్నట్టు తెలుస్తోంది.

యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. దీంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ను అరెస్ట్ చేసింది. రియా ఫోన్ డేటా ఆధారంగా పలువురు బాలీవుడ్ హీరోయిన్లను కూడా విచారించబోతోంది.