Neena Gupta
Neena Gupta recalls first kissing scene : విజయ్ వర్మ, తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) . జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సిరీస్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా సీనియర్ నటీ నీనా గుప్తా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరీర్‌లో ఆన్‌స్క్రీన్ లో తొలిసారి లిప్ కిస్ సీన్‌లో నటించిన తరువాత నోటిని డెటాల్‌లో శుభ్రం చేసుకున్నట్లు చెప్పింది.
ఓ యాక్టర్‌గా అన్ని సన్నివేశాలు చేయాలని, కొన్ని సార్లు బురదలోకి దిగాలి. ఇంకొన్ని సార్లు గంటల పాటు ఎండలో నిలబడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. కొన్నేళ్ల క్రితం నటుడు దిలీప్ ధావన్ కలిసి ఓ సీరియల్‌లో నటించాను. అయితే.. మా ఇద్దరి మధ్య ఓ లిప్ కిప్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇండియన్ టీవీ చరిత్రలో అదే మొదటి లిప్ కిప్ సీన్ కావొచ్చు. దీంతో ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలేకపోయాను అని నీనా చెప్పింది.
Tamannaah : ‘లస్ట్ స్టోరీస్-2’ అందరితో కలిసి చూడండి.. పేరు చూసి మోసపోకండి అంటున్న తమన్నా..
ముద్దు సన్నివేశాలను చిత్రీకరించాలనే ఆలోచన తనకు అంతగా సౌకర్యంగా లేదని నీనా గుప్తా తెలిపింది. “మేము ఇద్దరం(దిలీప్ ధావన్, నీనా ) స్నేహితులం కాదు. పరిచయస్తులం మాత్రమే. అతడు అందంగా ఉంటాడు. అయితే.. అప్పుడున్న పరిస్థితుల్లో దానికి ఎలాంటి సంబంధం లేదు. నిజానికి నేను మానసికంగా, శారీరకంగా సిద్దంగా లేను. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు చాలా టెన్షన్‌గా ఉన్నాను. కొందరు కామెడీ చేయలేరని, ఇంకొందరు కెమెరా ముందు ఏడవలేరని నాకు నేను ఆ సమయంలో మనసుకు సర్ది చెప్పుకుని. ధైర్యంగా ముందడు వేశా.” అని నీనా చెప్పింది.
Hamsa Nandini : ఐటెం సాంగ్స్‌తో ఒక ఊపు ఊపిన హీరోయిన్.. ఇప్పుడు ఆశ్రమంలో గుర్తుపట్టలేనంతగా
ఇక సన్నివేశం పూర్తి కాగానే తన నోటిని డెటాల్‌తో బాగా శుభ్రం చేసుకున్నట్లు తెలిపింది. అది నాకు కష్టంగా అనిపించింది. తెలియని వారిని ముద్దు పెట్టుకున్నాను అని నీనా అంది. ఇక ఆ రాత్రి అంతా తనకు నిద్ర పట్టలేదంది.
బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైన సత్తా చాటింది నీనా గుప్తా. ఆదత్ సే మజ్బూర్, ఉత్సవ్, లైలా, జానే భీ దో యారోన్, త్రికాల్, సుస్మాన్, కర్నామా వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వీరే ది వెడ్డింగ్, పంగా, ముల్క్ మరియు బధాయి హో వంటి చిత్రాలలో కనిపించింది.
Pawan Kalyan Bro : బ్రో టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైం వచ్చేశాయి.. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు..