Hamsa Nandini : ఐటెం సాంగ్స్‌తో ఒక ఊపు ఊపిన హీరోయిన్.. ఇప్పుడు ఆశ్రమంలో గుర్తుపట్టలేనంతగా
ఒక్కటవుదాం చిత్రంతో వెండితెరకు పరిచయమైంది హంసా నందిని. ఆ తరువాత వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అనుమానాస్పదం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

Hamsa Nandini
Hamsa Nandini in Isha : ‘ఒక్కటవుదాం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది హంసా నందిని (Hamsa Nandini). ఆ తరువాత వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనుమానాస్పదం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. హీరోయిన్‌గా అమ్మడికి సరైన బ్రేక్ రాలేదు. ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమాలో “మిర్చి మిర్చి” అంటూ స్పెషల్ సాంగ్‌లో దుమ్ములేపేసింది. దీంతో వరుసగా స్పెషల్ సాంగ్స్ లో అవకాశాలు క్యూ కట్టాయి. ‘లౌక్యం’, ‘అత్తారింటికి దారేది’, ‘లెజెండ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.
Adipurush : దేశప్రజలు బుద్ధిహీనులు అనుకుంటున్నారా..? ఆదిపురుష్ టీంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం..!
చివరిగా గోపిచంద్ హీరోగా నటించిన ‘పంతం’ సినిమాలో కనిపించింది. ఆ తరువాత సినిమాలకు దూరమైంది. ఇలా ఉండగా ఓ రోజు తాను క్యాన్సర్ బారిన పడినట్లు చెప్పి అభిమానులకు షాకిచ్చింది. దాదాపు ఏడాది పాటు క్యాన్సర్‌తో పోరాడి 16 సైకిల్స్ కీమో థెరపీ తర్వాత దాన్ని జయించింది. తాజాగా ఆమె కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమానికి వెళ్లింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే.. తొలుత ఆమెను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అంతలా మారిపోయింది హంసానందిని. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా.. ఇప్పుడు చాలా అందంగా ఉన్నావ్ అంటూ పలువరు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. హంసా నందిని ఫోటోలు పోస్ట్ చేస్తూ.. ‘సద్గురు చెప్పినట్లుగా ..”ఆత్మసాక్షాత్కారం” అంటే మీరు ఎంత మూర్ఖంగా ఉన్నారో గ్రహించడం. ప్రతిదీ ఇక్కడే ఉంది. మీరు దానిని గ్రహించలేరు. అయితే నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఒక అనిర్వచనీయమైన శక్తిని గ్రహించగలిగాను.” అంటూ హంసా నందిని చెప్పుకొచ్చింది.
Karthika Deepam : కార్తీకదీపం 2 పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు.. ఏం చెప్పాడంటే..?
Just made me realize what a beautiful feeling it is to be conscious and in the moment. Haven’t stopped smiling eversince. Thanks to Isha Foundation, Coimbatore, for inviting me and making this magic happen within me. ?#swanstories @ishafoundation pic.twitter.com/bw1sTtsNZq
— Hamsa Nandini (@ihamsanandini) June 26, 2023
ఇంత అందమైన అనుభూతి అని నాకు అర్థమయ్యేలా చేసిన కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కి ధన్యవాదాలు. నన్ను ఆహ్వానించి నాలో ఈ మాయాజాలం జరిగేలా చేసినందుకు అంటూ రాసుకొచ్చింది.
Malli Pelli : ఓటీటీలో దూసుకుపోతున్న ‘మళ్ళీ పెళ్లి’.. 100 మిలియన్ ఫ్లస్..