Telusu Kada : డీజే టిల్లు, KGF భామ కోసం.. డైరెక్టర్ గా మారిన కాస్ట్యూమ్ డిజైనర్.. ‘తెలుసు కదా’

ఇండస్ట్రీలో స్టార్ డిజైనర్ గా పేరు తెచ్చుకున్న నీరజ కోన ఇప్పుడు దర్శకురాలిగా కూడా మారబోతుంది. డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సినిమా తెరకెక్కిస్తోంది.

Telusu Kada : డీజే టిల్లు, KGF భామ కోసం.. డైరెక్టర్ గా మారిన కాస్ట్యూమ్ డిజైనర్.. ‘తెలుసు కదా’

Neeraja Kona Announced Movie with Siddhu Jonnalagadda and Srinidhi Shetty

Updated On : October 16, 2023 / 10:35 AM IST

Telusu Kada Movie : టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ (Kona Venkat) కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచమైన టెక్నీషియన్ నీరజ కోన (Neeraja Kona). బాద్‌షా సినిమాలో ఎన్టీఆర్ (NTR), కాజల్ అగర్వాల్ కి మొదటిసారి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసి కెరీర్ మొదలు పెట్టింది. అప్పట్నుంచి పలు పెద్ద సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూనే పర్సనల్ గా కూడా స్టార్స్ అందరికి కాస్ట్యూమ్ డిజైన్ చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ డిజైనర్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాక లిరిక్ రైటర్ గా, పుస్తక రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకుంది నీరజ కోన.

ఇప్పుడు దర్శకురాలిగా కూడా మారబోతుంది నీరజ. డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సినిమా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో KGF భామ శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాని ప్రకటిస్తూ టైటిల్ టీజర్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘తెలుసు కదా’.. అనే ఆసక్తికర టైటిల్ ని పెట్టారు.

Also Read : Sreeleela : శ్రీలీల – అనిల్ రావిపూడి చుట్టాలంట.. శ్రీలీల అనిల్‌ని ఏమని పిలుస్తుందో తెలుసా?

నీరజ కోన దర్శకురాలిగా మారి తెరకెక్కించబోతున్న మొదటి సినిమా ఇది. అలాగే పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థకు ఇది 30వ సినిమా కావడం విశేషం. సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత ఈ సినిమా రావొచ్చని సమాచారం. టైటిల్, టైటిల్ టీజర్ తోనే సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందించబోతున్నాడు.