×
Ad

Neeraja Kona : తాతయ్య గవర్నర్.. నాన్న ఎమ్మెల్యే.. డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

ఇన్నాళ్లు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి సక్సెస్ తెచ్చుకున్న నీరజ కోన ఇప్పుడు డైరెక్టర్ గా మారింది. (Neeraja Kona)

Neeraja Kona

Neeraja Kona : సినీ పరిశ్రమలో స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన. ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్ లో చాలా పెద్ద సినిమాలకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. నితిన్, నాని, నాగార్జున, సమంత, ఆది పినిశెట్టి .. ఇలా చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ కి నీరజ కోన పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ కూడా. వాళ్ళ సినిమాలకు ఈమెనే వర్క్ చేస్తుంది.(Neeraja Kona)

రచయిత కోన వెంకట్ బంధువుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి సక్సెస్ తెచ్చుకున్న నీరజ కోన ఇప్పుడు డైరెక్టర్ గా మారింది. ఏకంగా సిద్దు జన్నలగడ్డ హీరోగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా ‘తెలుసు కదా’ అనే సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పింది. తన తాతయ్య గవర్నర్ గా చేశారని, తన తండ్రి ఎమ్మెల్యేగా చేశారని తెలిపింది.

Also Read : K Ramp : వామ్మో.. కిరణ్ అబ్బవరం సినిమాలో మొత్తం ఎన్ని లిప్ కిస్ లు ఉండబోతున్నాయో తెలుసా?

నీరజ కోన తాతయ్య కోన ప్రభాకర రావు. ఆయన కాంగ్రెస్ తరపున బాపట్లకు ఎమ్మెల్యేగా చేసారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత మంత్రిగా చేశారు. అనంతరం పుదుచ్చేరి లెఫ్టినేట్ గవర్నర్ గా, మహారాష్ట్ర, సిక్కింలకు గవర్నర్ గా పనిచేసారు.

నీరజ కోన తండ్రి కోన రఘుపతి బాపట్ల నుంచి వైసీపీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈమెకు ఇంత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక తన బంధువు, అన్నయ్య వరుస అయ్యే కోన వెంకట్ సినీ పరిశ్రమలో స్టార్ రచయిత అని తెలిసిందే.

Also Read : Funky Teaser : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ టీజర్ వచ్చేసింది.. అనుదీప్ మార్క్ ఫుల్ కామెడీ..

Neeraja Kona

అలాగే ఆమె తన సినీ పరిశ్రమ ఎంట్రీ గురించి చెప్తూ.. మా ఇంట్లో నాకు, అన్నయ్యకు జాబ్స్, స్టడీ విషయంలో ఇదే చేయాలని ఏమి చెప్పలేదు. మాకు సపోర్ట్ ఇచ్చారు. అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను. అక్కడ ఉన్నప్పుడే పార్ట్ టైం జాబ్స్ చేసేదాన్ని. చదువు అయ్యాక అమెరికాలో పెద్ద బ్రాండ్ కంపెనీలకు ఫ్యాషన్ మార్కెటింగ్ లో పనిచేసాను. అమ్మానాన్న దగ్గర ఉండాలి అనిపించి ఇండియాకు తిరిగి వచ్చేసాను. అప్పుడు కోన వెంకట్ అన్నయ్య టాలీవుడ్ లో సరైన ఫ్యాషన్ డిజైనర్స్ లేరు. బాంబే నుంచి వస్తారు సినిమాలకు అని ఇక్కడ ట్రై చేయమన్నారు. దాంతో అలా ఇండస్ట్రీలో కాస్త్యుమ్ డిజైనర్ గా సెట్ అయ్యాను అని తెలిపింది.

నీరజ కోన కేవలం కాస్ట్యూమ్ డిజైనర్ మాత్రమే కాదు రచయిత కూడా. రచయితగా ఓ ఇంగ్లీష్ బుక్ ని రాసి రిలీజ్ చేసింది. ఇప్పుడు డైరెక్టర్ గా మారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి, ఇంత కష్టపడి ఇన్ని ట్యాలెంట్స్ ఉండటం గ్రేట్ అని అంటున్నారు నెటిజన్లు.