‘ఎంత మందితో తిరిగితే నీకేంటి? కంటెస్టెంట్‌ని బండ బూతులు తిట్టిన నేహా..

‘రోడీస్ రెవల్యూషన్’ ప్రోగ్రామ్‌లో కంటెస్టెంట్‌పై రెచ్చిపోయిన నేహా ధూపియా..

  • Published By: sekhar ,Published On : March 13, 2020 / 06:27 AM IST
‘ఎంత మందితో తిరిగితే నీకేంటి? కంటెస్టెంట్‌ని బండ బూతులు తిట్టిన నేహా..

Updated On : March 13, 2020 / 6:27 AM IST

‘రోడీస్ రెవల్యూషన్’ ప్రోగ్రామ్‌లో కంటెస్టెంట్‌పై రెచ్చిపోయిన నేహా ధూపియా..

సెలబ్రిటీలు ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడకపోతే తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటువంటి ఉదాహరణలు చాలా చూశాం. తాజాగా నేహా ధూపియాకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. బాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నేహా ధూపియా తెలుగులో బాలకృష్ణ ‘పరమవీర చక్ర’, రాజశేఖర్ ‘విలన్’ వంటి పలు సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత ప్రస్తుతం బుల్లితెరపై బిజీ అయింది.

‘నో ఫిల్టర్ విత్ నేహా’ కార్యక్రమం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ‘రోడీస్ రెవల్యూషన్’ ప్రోగ్రామ్‌లో నేహా టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోది. ఈ  ప్రోగ్రామ్‌లో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఈ కార్యక్రమంలో ఒక పోటీదారుడు తన గర్ల్ ఫ్రెండ్‌ తనను మోసం చేసిన విధానం గురించి వెల్లడించాడు. తన గర్లఫ్రెండ్‌ తనతో పాటు ఇంకో అయిదుగురు వ్యక్తుల‌తో ఒకేసారి డేటింగ్ చేసిందని, ఈ విషయం తెలిసి ఆమెను కొట్టానని చెప్పాడు.

దాంతో నేహా అతనిపై బూతు పురాణంతో విరుచుకుపడింది. ‘ఆమె ఎంత మందితో తిరిగితే నీకేంటి? ఎంత మందితో డేటింగ్ చేస్తే నీకేంటి? అది ఆమెకున్న ఫ్రీడమ్. ఆమె స్వేచ్ఛను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు’ అంటూ కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. రకరకాల మీమ్స్‌‌తో నేహాని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ వివాదంపై నేహా ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Read Also : అల్లు అర్జున్ అంటే అభిమానం కాదు.. అంతకుమించి..