Nanu Keerthana : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘నేను కీర్తన’.. ఎక్కడంటే..?

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Nanu Keerthana : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘నేను కీర్తన’.. ఎక్కడంటే..?

Nenu Keerthana Movie Streaming in OTT

Updated On : April 20, 2025 / 9:19 AM IST

Nanu Keerthana : చిమటా రమేష్ బాబు హీరోగా, రిషిత, మేఘన హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘నేను కీర్తన’. చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్ పై లక్ష్మి కుమారి నిర్మాణంలో రమేష్ బాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రేణు ప్రియా, సంధ్య, జీవా, విజయ్ రంగరాజ్, జబర్ధస్త్ అప్పారావు, జబర్ధస్త్ సన్నీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా గత ఏడాది ఆగస్టు 30న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

నేను కీర్తన సినిమా ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 99 రూపాయల రెంట్‌తో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్,కామెడీ, హర్రర్ తో.. మల్టీ జానర్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కించారు.

Also Read : Mahesh Babu : అమ్మతో ఉన్న ఫోటో షేర్ చేసి.. మిస్ యు అమ్మ అంటూ మహేష్ బాబు.. పోస్ట్ వైరల్

జానీ(రమేష్ బాబు) అన్యాయాలను ఎదురించే యువకుడిగా, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే వ్యక్తిగా నటించారు. ఓ విషయంలో తను శత్రువులతో పోరాడాల్సి వస్తుంది. అదే టైమ్‌లో జానీ లైఫ్‌లోకి కీర్తన వస్తుంది. ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారుతుంది. కీర్తన ప్రమాదంలో ఉన్న విషయం జానీకి తెలిసి ఆ ప్రమాదం నుంచి కీర్తనను జానీ ఎలా బయటకు తీసుకువచ్చాడనేది ఆసక్తికరంగా ఈ తెరకెక్కించారు.