Netflix makes official announcement on OTT streaming of War 2 movie
War 2 OTT: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా(War 2 OTT) విడుదల తరువాత మాత్రం నిరాశపరిచింది. రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం రూ.250 కోట్లు కలెక్ట్ చేయలేక డిజాస్టర్ గా నిలిచింది. అలాగే, ఎన్టీఆర్ లుక్ పై, యాక్టింగ్ పై తీవ్రమైన ట్రోలింగ్ నడిచింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు.
ఇక ఆగస్ట్ 14న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. తాజాగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. వార్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 9 గురువారం నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. అయితే, ఈ సినిమాకు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, వార్ 2 సినిమాకు థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ రావడంతో చాలా మంది ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. కాబట్టి, ఓటీటీలో ఎక్కువమంది చూసే అవకాశం ఉంది.
ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. పాన్ వరల్డ్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొదలైన ఈ సినిమా అవుట్ ఫుట్ ఒక రేంజ్ లో వస్తోందట. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్, సాలార్ కి మించి ఈ సినిమా ఉండబోతుంది అనే టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/wkTWTIu0Wu
— Netflix India South (@Netflix_INSouth) October 8, 2025