Rashmika Mandanna: నా వ్యక్తిగత విషయాలు మీకెందుకు చెప్పాలి.. అన్నీ సోషల్ మీడియాలో పంచుకోలేను: రష్మిక మందన్న
నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్(Rashmika Mandanna) అవుతోంది ఈ బ్యూటీ. ఓపక్క సినిమాలు, మరోపక్క వ్యక్తిగత జీవితం.

Rashmika Mandanna responds to trolling on social media
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది ఈ బ్యూటీ. ఓపక్క సినిమాలు, మరోపక్క వ్యక్తిగత జీవితం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ నడుస్తోంది. కొన్ని విషయాల్లో రశ్మికకు ఫేవర్ గా టాక్ నడుస్తుంటే కొన్ని విషయాల్లో మాత్రం ఆమెను ట్రోల్లింగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించింది రష్మిక. నిజానికి ఈ ట్రోలింగ్ ని పెద్దగా పట్టించుకోని రష్మిక(Rashmika Mandanna) ఈసారి మాత్రం కాస్త ఘాటుగానే స్పందించింది.
Ravi Teja: పాటలో బూతు పదాలు.. అప్పుడేమో తప్పు కాదా.. సినిమా చూసి మాట్లాడమంటున్న రవి తేజ
ఇంతకీ అసలు విషయం ఏంటంటే? కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయినా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కాంతార: చాఫ్టర్ 1. బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ విపరీతంగా వస్తున్నాయి. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాదించింది ఈ సినిమాకు రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలోనే రశ్మికను ట్యాగ్ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మీ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక మంచి సినిమా వస్తే కనీసం స్పందించలేవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ కామెంట్స్ పై విసిగిపోయిన రష్మిక సోషల్ మీడియాలో సీరియస్ పోస్ట్ పెట్టింది. “ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే నేను చూడలేను. కాంతార కూడా అంతే. రీసెంట్ గా సినిమా చూశాను మూవీ టీంని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశాను. కాబట్టి, తెర వెనక ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత జీవిజితంలో జరిగే ప్రతీ విషయాన్ని కెమెరా ముందుకి తీసుకురాలేం కదా. ప్రతీ విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిని కాదు నేను. అందుకే, ఇలాంటి విషయాల గురించి ప్రజలు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే మాత్రమే నాకు ముఖ్యం” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో థామా అనే సినిమా చేస్తోంది. హారర్ అండ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ఆయుశ్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కానుంది.