Ravi Teja: పాటలో బూతు పదాలు.. అప్పుడేమో తప్పు కాదా.. సినిమా చూసి మాట్లాడమంటున్న రవి తేజ

మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "మాస్ జాతర". (Ravi Teja)లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించాడు.

Ravi Teja: పాటలో బూతు పదాలు.. అప్పుడేమో తప్పు కాదా.. సినిమా చూసి మాట్లాడమంటున్న రవి తేజ

Hero Ravi Teja comments on Ole Ole song Trolling

Updated On : October 8, 2025 / 2:32 PM IST

Ravi Teja: మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “మాస్ జాతర”. లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించాడు. పక్కా మాస్, కామెడీ, కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా పలు వాయిదాల తరువాత అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమా విడుదల కోసం ఆడియన్స్ (Ravi Teja)ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Naga Chaitanya: తనను ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశాను.. అప్పటికే తను.. భార్య గురించి చెప్తూ సిగ్గుపడిపోయిన చైతూ

ఇదిలా ఉంటే, కొంతకాలం క్రితం మాస్ జాతర సినిమా నుంచి “ఓలే ఓలే” అనే పాటను విడుదల చేశారు మేకర్స్. శ్రీకాకుళం యాసలో వచ్చే ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కంపోజ్ చేశారు. ఇన్స్టాంట్ కిక్ ఇచ్చిన ఈ పాటలో నీ అమ్మని.. నీ అక్కని.. నీ చెల్లిని అనే పదాలను వాడారు. ఈ పదాలను వాడటంపై ఆడియన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బూతుపాట అంటూ, వంటనే ఆ పాటను బ్యాన్ చేయాలి అంటూ తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే, తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించాడు హీరో రవి తేజ.

ఇటీవల మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రవి తేజ ఈ పాట గురించి మాట్లాడుతూ.. “అందరూ ఆ పాటలో మొదటి పదాల గురించే మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చే సాహిత్యాన్ని పట్టించుకోవడం లేదు. ఆ పాట అలా ఎందుకు పెట్టాల్సివచ్చిందో సినిమా చేస్తే అర్థమౌతుంది. సినిమాలో సిచ్యుయేషన్ కు అది పర్ఫెక్ట్. సినిమాలో ఒక సందర్భం ప్రకారం హీరోయిన్ ఫ్యామిలీ కాళ్లు మొక్కి పోతా అంటాడు హీరో. అందుకే ఆ పదాలను అలా పెట్టాము. ఒకప్పుడు బుర్రకథల్లో కూడా ఇలాంటి పాదాలను వాడేవారు. కానీ, అవి బూతులు కాదు. కుటుంబమంతా కలిసి ఆస్వాదించేవారు” అంటూ చెప్పుకొచ్చాడు రవితేజ. దీంతో రవి తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.