Kumari Aunty : కుమారి ఆంటీ స్టోరీతో.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్..!

సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యిపోయిన కుమారి ఆంటీ పై బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ చేయబోతుందా..?

Netflix plans a documentary series on hyderabad Food Stall seller Kumari Aunty

Kumari Aunty : ఈమధ్య కాలంలో ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో.. అసలు తెలియడం లేదు. ఏదొక ఒక చిన్న మాటతో లేదా వీడియోతో వైరల్ అయ్యి ట్రేండింగ్ లోకి రావడం, ఆ తరువాత సోషల్ మీడియా మరియు మీడియా కవరేజ్ తో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యిపోవడం జరుగుతుంది. ఇక వీరికి వచ్చిన ఫేమ్‌ని.. సినిమా స్టార్స్ కూడా ఉపయోగించుకోవడం గమనార్హం. ఇక గత కొన్ని రోజులుగా ‘కుమారి ఆంటీ’ అనే మహిళ తెగ వైరల్ అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ గుడివాడకి చెందిన ఈ మహిళ.. మాదాపూర్ దుర్గంచెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ప్రారంభించి, రుచికరమైన భోజనం అందిస్తూ సక్సెస్ ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇక తక్కువ ధరకే కమ్మని భోజనం పెడుతున్న ఆ ఫుడ్ స్టాల్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. చాలామంది జనాలు కుమారి ఆంటీ వద్దకి వెళ్లడం స్టార్ట్ చేశారు. అధికమంది జనాలు తాకిడితో అక్కడ ట్రాఫిక్ కి అంతరాయం కలగడం, ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ స్టాల్ ని అక్కడి నుంచి తొలిగించాలని ఆర్డర్లు ఇవ్వడం జరిగింది.

Also read : Vyooham : ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాకు హైకోర్టులో దక్కని ఊరట..

ఇక అక్కడ మొదలయింది అసలు కథ. ఆమెను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పోస్టుల వేయడం, మీడియా కూడా కవరేజ్ చేయడంతో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పదించారు. ఆమెకు అండగా ఉంటానని చెప్పి, ఆమె అక్కడే బిజినెస్ చేసుకునేలా అవకాశం కల్పించారు. అంతేకాదు ఆమెను త్వరలో కలుస్తాను అని కూడా చెప్పుకొచ్చారు. ఇక స్వయంగా ఒక రాష్ట్ర సీఎం.. కుమారి ఆంటీ గురించి మాట్లాడడంతో చాలా పెద్ద టాపిక్ అయ్యింది.

దీంతో ప్రతి ఒక్కరు ఆమెకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ ఆసక్తిని గమనించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె పై కొన్ని ఎపిసోడ్స్ కూడా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కూడా కుమారి ఆంటీ లైఫ్ గురించి మూడు ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మరి దీనిలో ఎంత నిజముందో అనేది తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్ నుంచి ప్రకటన రావాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు