Vyooham : ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాకు హైకోర్టులో దక్కని ఊరట..

'వ్యూహం' సినిమా రిలీజ్ కోసం పోరాడుతున్న ఆర్జీవీకి మళ్ళీ చుక్క ఎదురైంది.

Vyooham : ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాకు హైకోర్టులో దక్కని ఊరట..

Ram Gopal Varma Vyooham movie went again to censor board certification

Vyooham : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఏపీ రాజకీయాలు నేపథ్యంతో వ్యూహం, శపథం సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో మొదటి చిత్రం ‘వ్యూహం’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ టీడీపీ నాయకులు తెలంగాణ హైకోర్టులో కేసు వెయ్యడంతో.. రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. జనవరి 11కి పోస్టుపోన్ అయ్యింది.

కానీ అప్పటికీ కోర్టు నుంచి విడుదలకు అనుకూల తీర్పు రాకపోవడంతో.. సినిమా రిలీజ్ అవుతుందా అనే సందేహం మొదలయింది. అయితే వర్మ మాత్రం ఈ సినిమాని విడుదల చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే కోర్టులో మూవీ రిలీజ్ కోసం పోరాడుతున్నారు. అయితే ఎంత ఫైట్ చేస్తున్నా ఆర్జీవీకి మాత్రం ఊరట దక్కడం లేదు. తాజాగా జరిగిన విచారణలో కూడా ఎదురు దెబ్బ ఎదుర్కోవాల్సి వచ్చింది.

Also read : Kangana Ranaut : ’12th ఫెయిల్’ దర్శకుడి భార్యపై.. కంగనా విమర్శలు.. నెటిజెన్స్ ప్రశంసలు..

గతంలో వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సర్టిఫికెట్ ని రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పుని ఇచ్చింది. అలాగే నాలుగు వారాల్లో మళ్లీ సెన్సార్ బోర్డు రివ్యూ చేసి కొత్త రిపోర్ట్స్ ని సడ్మిట్ చేయాలని కోరింది. అయితే వర్మ టీం.. సింగిల్ బెంచ్ తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ని పరిశీలించిన న్యాయమూర్తి కూడా.. సింగిల్ బెంచ్ తీర్పుని అనుగుణంగా సెన్సార్ బోర్డు ఈ నెల తొమ్మిది లోపు రిపోర్ట్ ఇవ్వాలని తీర్పుని ఇచ్చింది.

దీంతో మరోమారు అర్జీవికి చుక్క ఎదురైనట్లు అయ్యింది. కాగా ఈ మూవీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా
సీన్స్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుందని, అందుకనే ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.