×
Ad

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి నెట్ ఫ్లిక్స్ ట్రిబ్యూట్.. ఇండియాలో నంబర్ వన్ హీరో.. ఇది కదా అతని రేంజ్..

ఇండియా లెవల్లో పవన్ కళ్యాణ్ కి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి(Pawan Kalyan) ఒక సినిమా విడుదల అవుతుంది అంటే వచ్చే ఆ వైబ్రేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది.

Netflix releases special video for Pawan Kalyan

Pawan Kalyan: ఇండియా లెవల్లో పవన్ కళ్యాణ్ కి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఒక సినిమా విడుదల అవుతుంది అంటే వచ్చే ఆ వైబ్రేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా విడుదల కన్నా ఫ్యాన్స్ చేసే ఆ హంగామానే ఎక్కువ. ఆ రేంజ్ ఫ్యానిజం అంటే రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ కి తప్పా ఎవరికీ లేదు అనడం లేదు ఎలాంటి సందేహం లేదు. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన మూవీ ఓజీ. గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా(Pawan Kalyan) బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మొదటిరోజు ఏకంగా రూ.154 కోట్ల భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.335 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Balakrishna: టైం ట్రావెల్ చేయనున్న బాలయ్య.. ఆదిత్య 999 కంటే ముందే.. నవంబర్ లోనే ముహూర్తం..

ఇక ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపధ్యంలోనే నెట్ ఫ్లిక్స్ సంస్థ పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే ట్రిబ్యూట్ ఇచ్చింది. దీపావళి కానుకగా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ పెయింటింగ్ ని దీపాలతో కళాత్మకంగా అలంకరించారు. ఇలా ఒక హీరోకి ట్రిబ్యూట్ గా నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ చేయడం ఇదే మొదటిసారి. అది కూడా ఇండియా లెవల్లో పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఆ క్రెడిట్ దక్కింది.

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఓజీ సినిమాలోని పాట లిరిక్స్ “ఎవ్వరికి అందదు అతని రేంజ్..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగతా హీరోల ఫ్యాన్స్ సైతం నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన ఈ వీడియోకి ఫిదా అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే.. కొంతకాలం ఆయన రాజకీయ భాద్యతలతోనే బిజీగా ఉండనున్నాడు. ఆ తరువాత దర్శకుడు సుజీత్ తో ఓజీ సీక్వెల్, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తాడు. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది.