Balakrishna: టైం ట్రావెల్ చేయనున్న బాలయ్య.. ఆదిత్య 999 కంటే ముందే.. నవంబర్ లోనే ముహూర్తం..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నాడు. వరుసగా (Balakrishna)క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ కుర్ర హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖండ: తాండవం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Balakrishna: టైం ట్రావెల్ చేయనున్న బాలయ్య.. ఆదిత్య 999 కంటే ముందే.. నవంబర్ లోనే ముహూర్తం..

Balakrishna-Gopichand Malineni movie to start on November 7th

Updated On : October 24, 2025 / 3:15 PM IST

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ కుర్ర హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖండ: తాండవం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా(Balakrishna) లెవల్లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా విడుదల కాకముందే మరో క్రేజీ ప్రాజెక్టుకి ఒకే చెప్పేశాడు బాలకృష్ణ.

Spirit: నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది.. “స్పిరిట్” నుంచి సౌండ్ టీజర్.. డైలాగ్స్తోనే గూస్ బంప్స్ తెప్పించారు..

దర్శకుడు గోపిచంద్ మలినేనితో బాలకృష తన తరువాతి సినిమాను చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుపై కూడా చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా పూజ కార్యక్రమాలు నవంబర్ 7న జరుగనున్నాయట. ఇక ఈ సినిమా కోసం సరికొత్త పాయింట్ ను సెట్ చేశాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుందట. టైం ట్రావెల్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉండనున్నాయట.

అది కూడా తెలుగులో ఇప్పటివరకు ఎవరు చూపించని విదంగా చూపించబోతున్నారట. దీంతో, ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెరుగుతున్నాయి. ఇక గతంలో బాలకృష్ణ చేసిన ఆదిత్య 369 సినిమాలో కూడా ఇలాంటి టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంటుంది. దీనికి సీక్వెల్ గా ఆదిత్య 999 మాక్స్ అనే సీక్వెల్ చేయాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నాడు బాలకృష. ఇప్పుడు ఈ సినిమా కంటే ముందే గోపించంద్ మలినేని బాలకృష్ణని టైం ట్రావెల్ చేయించేందుకు సిద్ధం అవుతున్నాడు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ సినిమా ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతిని పంచుతుంది అనేది చూడాలి.