Spirit: నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది.. “స్పిరిట్” నుంచి సౌండ్ టీజర్.. డైలాగ్స్తోనే గూస్ బంప్స్ తెప్పించారు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Spirit) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్-సందీప్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Spirit: నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది.. “స్పిరిట్” నుంచి సౌండ్ టీజర్.. డైలాగ్స్తోనే గూస్ బంప్స్ తెప్పించారు..

Prabhas Spirit Movie Voice teaser released

Updated On : October 24, 2025 / 3:44 PM IST

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్-సందీప్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.(Spirit) దాదాపు రెండేళ్ల కృతమే స్పిరిట్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. కానీ, రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలవలేదు. ఇక అప్పటినుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఫ్లోర్ పైకి వెళుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ వస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కానీ, ప్రభాస్ ఇప్పటికే ఒకే చేసిన పలు సినిమాల షూటింగ్ ఆలస్యంగా జరుగుతుండటంతో స్పిరిట్ ఆలస్యం అవుతూ వస్తోంది.

Samantha: సమంత ఈజ్ బ్యాక్.. ఎట్టకేలకు మొదలైన “మా ఇంటి బంగారం”.. ఇక నాన్ స్టాప్..

ఈ నేపధ్యంలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా స్పిరిట్ సినిమా నుంచి వాయిస్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీజర్ మొదలయ్యింది. ప్రకాష్ రాజ్ వాయిస్ తో పవర్ ఫుల్ గా మొదలైన ఈ టీజర్ లో కేవలం డైలాగ్స్ మాత్రమే వినిపించాయి. ప్రభాస్ కనిపించకపోయినా “నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది” అంటూ ఆయన చెప్పిన డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి. ఇలా నటీనటులు లేకుండా టీజర్ విడుదల చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

చాల పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రభాస్ క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ వచ్చిన ఈ వాయిస్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. కేవలం వాయిస్ తోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడంటే రేపు సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.