Netflix stops Streaming Indian Theatrical Movies Uncut Version
Netflix : వరల్డ్ వైడ్ టాప్ ఓటీటీల్లో ఒకటి నెట్‌ఫ్లిక్స్. ఇండియాలో కూడా దీనికి చాలామంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా నెట్‌ఫ్లిక్స్ లోకల్ మర్కెట్స్ మీద ఫోకస్ చేస్తూ ఇక్కడి భాషల్లో కంటెంట్స్ తీస్తుంది. కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సీఈఓ కూడా మన టాలీవుడ్ స్టార్స్ అందరిని కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే.
అయితే నెట్‌ఫ్లిక్స్ లో మంచి కంటెంట్ తో పాటు బోల్డ్, A సర్టిఫికెట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ప్రేక్షకులు అలాంటి కంటెంట్ కోసమే నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటారు. ఇండియన్ సెన్సార్ బోర్డు సినిమాలని సెన్సార్ చేసి రిలీజ్ కి పర్మిషన్స్ ఇస్తుంది. అయితే సెన్సార్ చేయని వర్షన్ సినిమాలని ఓటీటీల్లో రిలీజ్ చేస్తారు చిత్రయూనిట్. అయితే ఇటీవల ఓటీటీల్లో ఎక్కువగా A రేట్ కంటెంట్, అసభ్యకర కంటెంట్, వైలెన్స్ పెరుగుతుండటంతో ఓటీటీలలో కూడా సెన్సార్ ఉండాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
Also Read : Prashanth Neel : నాకు ఆ సమస్య ఉంది.. అందుకే నా సినిమాలన్నీ డార్క్ గా ఉంటాయి..
ఇప్పటికే వేరే ఓటీటీలు వెబ్ సిరీస్ లు ఎలా ఉన్నా థియేట్రికల్ రిలీజ్ సినిమాలు మాత్రం సెన్సార్ చేసినవే రిలీజ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ మాత్రం సెన్సార్ కట్ చేసిన సీన్స్ తో కలిపి స్ట్రీమింగ్ చేస్తుంది. ఇకపై అలా స్ట్రీమింగ్ అవ్వవని సమాచారం. కేవలం థియేట్రికల్ రిలీజ్ సినిమాల వరకు ఇండియన్ సెన్సార్ రూల్స్ ప్రకారమే సెన్సార్ చేసిన వర్షన్స్ మాత్రమే తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ తాజాగా తెలిపింది. దీంతో A రేటెడ్ ఫుల్ వర్షన్ సినిమాల కోసం నెట్‌ఫ్లిక్స్ తీసుకున్నవారికి నిరాశే. అయితే వాటి సొంత కంటెంట్స్ మాత్రం ఇలాంటి నిబంధనలు ఏమి లేకుండా ఇప్పుడు ఉన్నట్టే స్ట్రీమ్ చేస్తుంది నెట్ ఫ్లిక్స్.