Prashanth Neel : నాకు ఆ సమస్య ఉంది.. అందుకే నా సినిమాలన్నీ డార్క్‌గా ఉంటాయి..

ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ డార్క్ ఫ్రేమ్స్ లోనే ఉంటాయి. ఎక్కువ కలర్స్ కనపడవు. ఇప్పుడు వచ్చే సలార్ కూడా డార్క్ గానే ఉండబోతుంది. అయితే దీనికి ఒక కారణం ఉందని తాజా ఉంటర్వ్యూలో చెప్పాడు ప్రశాంత్ నీల్.

Prashanth Neel : నాకు ఆ సమస్య ఉంది.. అందుకే నా సినిమాలన్నీ డార్క్‌గా ఉంటాయి..

Prashanth Neel gives Clarity on why His Movies in Dark Frames

Updated On : December 19, 2023 / 10:32 AM IST

Prashanth Neel : కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసింది మూడు సినిమాలే అయినా ఇప్పుడు నేషనల్ వైడ్ స్టార్ డైరెక్టర్. మొదటి సినిమా ఉగ్రంతో కన్నడలో మంచి విజయం సాధించి, ఆ తర్వాత KGF రెండు సినిమాలతో నేషనల్ వైడ్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్(Prabhas) తో సలార్(Salaar) సినిమాతో రాబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకి ప్రమోషన్స్ చేయకపోయినా కొన్ని ఇంటర్వ్యూలు మాత్రం ఇస్తున్నారు.

తాజాగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలని తెలిపాడు. ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ డార్క్ ఫ్రేమ్స్ లోనే ఉంటాయి. ఎక్కువ కలర్స్ కనపడవు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా బాగా వచ్చాయి. ఇప్పుడు వచ్చే సలార్ కూడా డార్క్ గానే ఉండబోతుంది. అయితే దీనికి ఒక కారణం ఉందని తాజా ఉంటర్వ్యూలో చెప్పాడు ప్రశాంత్ నీల్.

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. నాకు OCD (Obsessive compulsive disorder) సమస్య ఉంది. నాకు ఏదైనా ఎక్కువ కలర్స్ ఉంటే నచ్చదు. అందుకే నా సినిమాలు అలా అంటాయి. నా పర్సనల్ థాట్స్ అక్కడ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అంతే కానీ నా సినిమాలకు ఒకదానికొకటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ OCD ఉన్నవాళ్లు కేవలం ప్రతీది క్లీన్ గా ఉండాలి, చేసింది రిపీట్ గా చేసే సమస్యలే కాదు, డిఫరెంట్ ఆలోచనలు, కలర్స్ కి సంబంధించి ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి.

Also Read : బాలీవుడ్ లో ప్రభాస్ సత్తా.. ముంబైలో 120 అడుగుల కటౌట్..

అలాగే.. KGF, సలార్ సినిమాలకు ఎలాంటి కనెక్షన్ లేదు అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమా తెలుగులోనే తీసి మిగిలిన భాషల్లోకి డబ్బింగ్ చేశామని, ఈ సినిమా ఇద్దరు ప్రాణమిత్రులు శత్రువులుగా మారే కథ అని తెలిపాడు. సలార్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.