The Ice Road : నెట్ ఫ్లిక్స్‌లో అదరగొడుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ది ఐస్ రోడ్’
ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌లో కొత్తగా రిలీజ్ అయిన మూవీల్లో టాప్ 10 లిస్టులో ఏ మూవీ చేరుతుందో ఊహించడం కష్టమే.. కొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి టాప్ లిస్టులోకి దూసుకొచ్చింది.

Netflix’s Action Thriller Jumped To Top On The Charts
The Ice Road : ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌లో కొత్తగా రిలీజ్ అయిన మూవీల్లో టాప్ 10 లిస్టులో ఏ మూవీ చేరుతుందో ఊహించడం కష్టమే.. ఈ వారం నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫాంపై విడుదలైన మూవీల కంటే కొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి టాప్ లిస్టులోకి దూసుకొచ్చింది. అదే.. The Ice Road (2021). నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సర్వీసు పబ్లిక్ ర్యాంకింగ్ సిస్టమ్ ప్రకారం.. ‘ది ఐస్ రోడ్’ అత్యంత పాపులర్ మూవీగా ట్రెండ్ అవుతోంది. టేకెన్ స్టార్ లియామ్ నీసన్ ఒక యాక్షన్ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో సందడి చేస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ జూన్ 25 న అమెరికాలోని నెట్‌ఫ్లిక్స్, యూకేలోని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అది నేరుగా టాప్ లిస్టులోకి దూసుకొచ్చింది. ఐస్ రోడ్ ట్రక్కర్ గా లియామ్ నీసన్ ఈ మూవీలో నటించాడు. ఉత్తర కెనడాలో చిక్కుకున్న మైనర్లను రక్షించేందుకు డేంజరస్ రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహిస్తాడు. లియాం నీసన్ స్టార్ ఎన్నో ఐకానిక్ రోల్స్ పోషించాడు. ప్రతి ఏడాదిలో ఒక యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపిస్తూనే ఉంటాడు.
ఇప్పుడు The Ice Road 2021 మూవీతో నెట్ ఫ్లిక్స్‌లో అదరగొట్టేస్తున్నాడు. జోనాథన్ హెన్స్లీ – డై హార్డ్ విత్ ఎ వెంజియెన్స్ ఆర్మగెడాన్ కథ రాశారు. ఈ రెండింటి తర్వాత ‘ది ఐస్ రోడ్’ అతడు దర్శకత్వం వహించిన మూడవ మూవీ. రెండవ స్థానంలో ‘ఫాదర్‌హుడ్’ ఉంది. కెవిన్ హార్ట్ నెట్‌ఫ్లిక్స్ మూవీ widower.. ఇదో ట్రూ స్టోరీ ఆధారంగా రూపొందింది. మూడో స్థానంలో ‘Good on Paper’ మూవీ. గతంలో మాదిరిగానే నాలుగు యానిమేటెడ్ మూవీలు కూడా లిస్టులో చేరాయి. అందులో నెట్‌ఫ్లిక్స్ నుంచి ‘విష్ డ్రాగన్, ‘డాగ్ గాన్ ట్రబుల్’ ‘ది మిచెల్స్ వర్సెస్ ది మెషీన్స్’ 2015 డ్రీమ్‌వర్క్స్ ‘హోమ్’ మూవీలు స్ట్రీమింగ్ అయ్యాయి.