Raai Laxmi
Raai Laxmi : ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది. మహమ్మారి దెబ్బకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మరోవైపు ఆక్సిజన్ కొరత. వెరసి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయిన వారు కళ్లముందే చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ప్రస్తుతం దేశం మొత్తం తీవ్ర ఆవేదనలో ఉంది. ఇలాంటి కష్ట సమయంలో కొందరు సెలబ్రిటీలు చేస్తున్న పనులు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. వారు తీరు చర్చకు దారితీస్తోంది. తాజాగా గ్లామర్ బ్యూటీ రాయ్ లక్ష్మీ చేసిన పని నెటిజన్లకు తీవ్రమైన కోపం తెప్పించింది.
What is to give light must endure burning.?? #morning #earlysunrise #earlyday #bliss #blissfullday #nofilter #beyou #staypositive #staysafe #behappy #loveyouall ❤️ pic.twitter.com/XgGGVnaumP
— RAAI LAXMI (@iamlakshmirai) May 10, 2021
ఖైదీ నెంబర్ 150లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రత్తాలు అనే సాంగ్‌కు రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన గ్లామర్ బ్యూటీ రాయ్ లక్ష్మీ. తెలుగులో ఈ అమ్మడు కథానాయికగా పలు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఐటెం సాంగ్‌తో మంచి క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మీ తరచు తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.
Satisfy your SOUL not the SOCIETY.??#naturelovers #staysafe #staystrong #loveit #metime #waterbaby ❤️ pic.twitter.com/RrpzBruOt8
— RAAI LAXMI (@iamlakshmirai) May 7, 2021
కాగా, రాయ్ లక్ష్మీ లివింగ్ ప్లేస్ చెన్నయ్ సహా స్వస్థలం బెల్గామ్(కర్నాటక) కరోనా కల్లోలంతో వణికిపోతుంటే.. ఈమె మాత్రం కేక్ లు కట్ చేస్తూ, బర్త్ డే లు, మదర్స్ డేలు జరుపుకుంటూ సెలబ్రేషన్ పతాక స్థాయికి తీసుకెళ్లింది. అంతేకాదు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. దీన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. అంతా కష్టాలు పడుతున్న సమయంలో నువ్వు ఇలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోవడం, వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అవసరమా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాల్లో ఫాలోయింగ్ పెంచుకొని వాటి ద్వారా డబ్బులు ఆర్జించేందుకు ఇలా వరుస ఫోటోషూట్లను చేస్తున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు.
@iamlakshmirai Bday Girl Cake cutting With her cuties pic.twitter.com/XIpzafDzQQ
— Joseph (@joseph_kurvila) May 8, 2021