Bandla Ganesh : అయ్యప్ప మాలలో ఉండి ఆ పనిచేస్తావా? బండ్లన్నపై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

దీపావళి సాయంత్రం క్రాకర్స్ కాలుస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు బండ్లన్న. క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోల్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే బండ్ల గణేష్ ప్రస్తుతం అయ్యప్ప మాల(Ayyappa Deeksha) వేసుకొని ఉన్నారు.

Netizens Fires on Bandla Ganesh for wearing Slippers in Ayyappa Deeksha

Bandla Ganesh : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సినిమాల్లో నటించిన దానికన్నా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై స్పీచ్ లతో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక బండ్ల గణేష్ రాజకీయాల్లో కూడా ఉన్నారు. రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై స్పందిస్తూ ఉంటాడు. రాజకీయాలపై తన ఇంటర్వ్యూలు కూడా వైరల్ అవుతుంటాయి.

దీపావళి పండుగ సమయంలో బండ్ల గణేష్ క్రాకర్స్ షాప్‌ల్లో అమ్మే టపాసులు అన్ని ఆయన ఇంటిలోనే దర్శనమిస్తాయి. బండ్లన్న కొన్న టపాసులు అన్ని నేలపై అందంగా పరిచి వాటితో ఒక ఫోటో దిగి బండ్ల గణేష్ ప్రతి ఏడాది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తారు. ఈ సారి కూడా బాగానే క్రాకర్స్ కొని వాటితో ఫోటో దిగి పోస్ట్ చేశారు. ఇక దీపావళి సాయంత్రం క్రాకర్స్ కాలుస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు బండ్లన్న. క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోల్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Also Read : Animal Song : నాన్న నువ్ నా ప్రాణం.. ‘యానిమల్’ సాంగ్ రిలీజ్.. ఏడిపించేశారుగా..

అయితే బండ్ల గణేష్ ప్రస్తుతం అయ్యప్ప మాల(Ayyappa Deeksha) వేసుకొని ఉన్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు కాళ్లకు చెప్పులు వేసుకోరు. కానీ బండ్లన్న షేర్ చేసిన దీపావళి సెలెబ్రేషన్స్ వీడియోలో కాళ్లకు చెప్పులు వేసుకొని ఉన్నాడు. చెప్పులు వేసుకొని తిరిగేస్తున్నారు బండ్ల గణేష్. దీంతో పలువురు నెటిజన్లు బండ్లన్నని విమర్శిస్తున్నారు. అయ్యప్ప మాలలో ఉండి చెప్పులు వేసుకుంటావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడానికి దీక్ష వేసుకోవడం ఎందుకు అని ఫైర్ అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం.. మాలలో ఉన్నా కొంతమంది హెల్త్ గురించి ఆలోచించి కాళ్ళకి ఏం గుచ్చుకోకూడదని చెప్పులు వాడతారు. అతను బయట క్రాకర్స్ పేలుస్తున్నారు కాబట్టి వేసుకున్నారు, ఇంట్లో వేసుకోరేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బండ్లన్న ఈసారి ఇలా వైరల్ అయ్యారు. మరి దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తారేమో చూడాలి.