Animal Song : నాన్న నువ్ నా ప్రాణం.. ‘యానిమల్’ సాంగ్ రిలీజ్.. ఏడిపించేశారుగా..
యానిమల్ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా 'నాన్న నువ్వు నా ప్రాణం..' అంటూ సాగే పాట రిలీజయింది.

Nanna Nuv Naa Pranam Father Emotional Song Released From Animal Movie
Animal Song : రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న జంటగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘యానిమల్’(Animal) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. డాన్ లాంటి కథాంశంతో పాటు ప్రేమ, ఎమోషన్స్ అన్ని చూపించబోతున్నారు ఈ సినిమాలో.
ఇప్పటికే యానిమల్ సినిమా టిజర్ రిలీజ్ అవ్వగా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక యానిమల్ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా ‘నాన్న నువ్వు నా ప్రాణం..’ అంటూ సాగే పాట రిలీజయింది. ఈ సాంగ్ లో రణబీర్ కపూర్, అతని తండ్రి అనిల్ కపూర్ కి మధ్య ఉన్న బంధాన్ని చూపించారు. దీంతో సినిమా తండ్రి – కొడుకుల మధ్య కథలా ఉండబోతుందని, మంచి ఫాదర్ ఎమోషన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Shouryuv : నాని ‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్ ఈ సోషల్ మీడియా స్టార్‌కి అన్నయ్య?
ఇక ఈ సాంగ్ అయిదు భాషల్లోనూ రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సాంగ్ మంచి మెలోడీతో మెప్పించింది. ఈ పాట వింటే ఎవ్వరికైనా వాళ్ళ నాన్న గుర్తొచ్చి కన్నీళ్లు పెడతారు కచ్చితంగా, అంతలా ఎమోషన్ చూపించారు ఈ పాటలో. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ గా మారింది. ఇక ఈ పాటని అనంత శ్రీరామ్ రాయగా, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు. సింగర్ సోను నిగమ్ పాడారు.