Telugu Film Directors: దర్శకుల సంఘం కొత్త అధ్యక్షుడిగా విశ్వనాథ్
ప్రముఖ దర్శకులు, తెలుగు సినిమా నటుడు యనమదల కాశీ విశ్వనాథ్ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నూతన అధ్యకుడిగా ఎంపికయ్యారు.

Viswanath
Telugu Film Directors Association: ప్రముఖ దర్శకులు, తెలుగు సినిమా నటుడు యనమదల కాశీ విశ్వనాథ్ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నూతన అధ్యకుడిగా ఎంపికయ్యారు.
జనరల్ సెక్రెటరీగా మరో దర్శకుడు వీఎన్ ఆదిత్య, ఉపాధ్యక్షులుగా జీఎస్ రావు, మేర్లపాక గాంధీ ఎన్నికయ్యారు. కోశాధికారిగా భాస్కర్ రెడ్డిని ఎన్నికున్నారు దర్శకులు. గురువారం(18 నవంబర్ 2021) కొత్తగా ఎన్నికైన సభ్యులు అందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నువ్వు లేక నేను లేను సినిమాతో దర్శకుడిగా ఆరంగ్రేటం చేసిన కాశీ విశ్వనాథ్.. తొలిచూపులోనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. నచ్చావులే సినిమాతో నటుడిగా కూడా పరిచయం అయ్యారు. ఆ సినిమా నుంచి కాశీ విశ్వనాథ్ నటుడిగా కొనసాగుతున్నాడు.
వందకు పైగా సినిమాల్లో నటించిన కాశీవిశ్వనాథ్ తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంకు దగ్గర్లోని సీతానగరం మండలం, పురుషోత్తపట్నంలో జన్మించాడు.
జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన మరో దర్శకుడు వీఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్‌తో మనసంతా నువ్వే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.
Eesha Rebba : అచ్చతెలుగు అందం.. ఈషా రెబ్బా సొంతం..