Manoj-Mounika : భూమా దంపతులకు నివాళులు అర్పించనున్న మనోజ్, మౌనిక.. భారీ కాన్వాయ్‌తో ఆళ్లగడ్డకు పయనం..

నేడు ఉదయం మంచు మనోజ్, భూమా మౌనిక భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డ బయలుదేరారు. మధ్యలో ప్రముఖ రాజకీయ నేత, మౌనిక బంధువు అయిన రామ సుబ్బారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం ఆళ్లగడ్డ వెళ్లి భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల సమాధిని సందర్శించి................

Newly wedding couple monoj and mounika going to allagadda and pay tributes to bhuma nagireddy and sobha couple

Manoj-Mounika :  మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ కొన్ని సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి అభిమానులని సంపాదించుకున్నాడు. మనోజ్ చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ తర్వాత ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా అప్పట్నుంచి మంచు మనోజ్ సినిమాలకు దూరంగానే ఉన్నాడు. ఇటీవలే ఓ సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు మనోజ్. గతంలోనే మనోజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

మొత్తానికి ఈ వార్తలకు స్వస్తి చెప్తూ మంచు మనోజ్ ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని మార్చ్ 3 శుక్రవారం రాత్రి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం హైదరాబాద్ లోని మనోజ్ ఇంట్లోనే జరిగింది. ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడంతో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం నేడు భూమా మౌనిక సొంత ఊరు ఆళ్లగడ్డకు వెళుతున్నారు.

Yash Next Movie : KGF స్టార్ యశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు?? తెరపైకి మరో డైరెక్టర్ పేరు.. అతనితోనే యశ్ నెక్ట్ సినిమా?

నేడు ఉదయం మంచు మనోజ్, భూమా మౌనిక భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డ బయలుదేరారు. మధ్యలో ప్రముఖ రాజకీయ నేత, మౌనిక బంధువు అయిన రామ సుబ్బారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం ఆళ్లగడ్డ వెళ్లి భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు కొత్త జంట. అనంతరం ఆళ్లగడ్డలో భూమా వారింట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడనున్నారు మనోజ్, మౌనిక. ఆళ్లగడ్డలో నేడు భూమా ఫ్యామిలీ అభిమానులకు, కార్యకర్తలకు భారీ విందు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.