Yash Next Movie : KGF స్టార్ యశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు?? తెరపైకి మరో డైరెక్టర్ పేరు.. అతనితోనే యశ్ నెక్ట్ సినిమా?

Yash Next Movie : యశ్ పలువురు డైరెక్టర్స్ తో సినిమా చేస్తున్నాడని పేర్లు వినిపించినా ఎవరితో ఉంటుంది ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా యశ్ లిస్ట్ లో మరో కొత్త డైరెక్టర్ పేరు వినిపిస్తుంది.

Yash Next Movie : KGF స్టార్ యశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు?? తెరపైకి మరో డైరెక్టర్ పేరు.. అతనితోనే యశ్ నెక్ట్ సినిమా?

Yash Next Movie with kabjaa director R Chandru news goes viral

Yash Next Movie :  ‘కేజీఎఫ్’ తో గ్లోబల్ వైడ్ అప్రిసియేషన్ దక్కించుకున్నాడు కన్నడ రాక్ స్టార్ యశ్. ఫస్ట్ పార్ట్ ను మించి సెకండ్ పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో యశ్ మరింతగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ‘కేజీఎఫ్ 2’ రిలీజై ఇప్పటికి 10 నెలలైంది. కానీ ఇంతవరకూ యశ్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ లేకుండా పోయింది. శంకర్ డైరెక్షన్ లో ఉంటుందని, కన్నడ డైరెక్టర్ నర్తన్ అని, తమిళ డైరెక్టర్ పియస్ మిత్రన్ అని ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ వీటిపై ఎలాంటి అప్డేట్ లేదు. యశ్ అభిమానులైతే ఈ విషయంలో చాలా నిరాశ చెందుతున్నారు. యశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఉంటుంది అని ఎదురు చూస్తున్నారు.

యశ్ పలువురు డైరెక్టర్స్ తో సినిమా చేస్తున్నాడని పేర్లు వినిపించినా ఎవరితో ఉంటుంది ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా యశ్ లిస్ట్ లో మరో కొత్త డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. కన్నడ డైరెక్టర్ ఆర్. చంద్రు యశ్ తో సినిమా తీస్తాడని వార్తలు వస్తున్నాయి. చంద్రు తాజ్ మహల్, మైలారీ, ప్రేమ్ కహాని, కోకో , చార్మినార్.. లాంటి అనేక కన్నడ సినిమాలు డైరెక్ట్ చేసి హిట్స్ కొట్టాడు. తన గత రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఈ డైరెక్టర్ తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని ఓ సినిమా కూడా చేశాడు. ప్రస్తుతం చంద్రు కన్నడలో KGF తర్వాత ఆ రేంజ్ లో తెరకెక్కిన భారీ సినిమా ‘కబ్జ’ని డైరెక్ట్ చేశాడు. కన్నడ స్టార్ హీరోలు కిచ్చ సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్ కలిసి నటిస్తున్న ఈ మాఫియా సినిమా భారీ అంచనాలతో మార్చ్ 17న రిలీజ్ కాబోతుంది.

Rajamouli : RRR సినిమాలో హీరోలేనా.. వాళ్ళని కూడా పట్టించుకోండి.. అభిమానుల ఆవేదన..

ఈ మూవీ తర్వాత చంద్రు చేయబోయే సినిమా యశ్ తోనే అని వార్తలొస్తున్నాయి. కబ్జ లాంటి భారీ సినిమా తెరకెక్కించిన తర్వాత యశ్ లాంటి స్టార్ హీరోతో మరో భారీ సినిమా డైరెక్ట్ చేస్తాడని కన్నడ మీడియా అంటుంది. మరి ఇది అయినా నిజమవుతుందా? KGF తర్వాత యశ్ చంద్రుతో సినిమా తీస్తాడా చూడాలి.