దగ్గుబాటి వారి ఇంట సత్యనారాయణ వ్రతం..

  • Published By: sekhar ,Published On : August 12, 2020 / 12:04 PM IST
దగ్గుబాటి వారి ఇంట సత్యనారాయణ వ్రతం..

Updated On : August 12, 2020 / 12:28 PM IST

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల వివాహం శనివారం(ఆగస్టు8) రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా దగ్గుబాటి వారి ఇంట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన వధూవరులు సత్యనారాయణ స్వామి వ్రతం (పూజ) చేయడం తెలుగు కుటుంబాలలో ఓ ఆనవాయితీ. హిందూ సంప్రదాయంలో ఈ సనాతన ఆచారం ప్రకారం కొత్త జంట రానా, మిహీకా ఇటీవల పూజ చేశారు.

దగ్గుబాటి వారింట జరిగిన ఈ సత్యనారాయణ స్వామి పూజకు బజాజ్‌ కుటుంబం హాజరైంది. వియ్యంకులు సురేశ్‌ బాబు, సురేశ్‌ బజాజ్‌, వెంకటేశ్‌ పంచెకట్టులో సందడి చేశారు. సమంత, నాగ చైతన్యతో సహా పలువురు కుటుంబ సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Daggubati Family Satyanarayana Vratam