బిగ్‌బాస్ 4: డేరింగ్ రిపోర్టర్.. భయంగా ఎంట్రీ.. రెండు నందుల విన్నర్.. దేవి స్పెషల్ టాలెంట్స్ ఇవే!

  • Published By: vamsi ,Published On : September 7, 2020 / 08:59 AM IST
బిగ్‌బాస్ 4: డేరింగ్ రిపోర్టర్.. భయంగా ఎంట్రీ.. రెండు నందుల విన్నర్.. దేవి స్పెషల్ టాలెంట్స్ ఇవే!

Updated On : September 7, 2020 / 10:12 AM IST

బుల్లితెర బిగ్‌‌బాస్.. మరోసారి సందడి చెయ్యడానికి ప్రతి ఇంట్లోకి బుల్లి తెర మీదకి వచ్చేసింది. ‘ఎంటర్‌టైన్మెంట్‌ లైక్ నెవర్‌ బిఫోర్‌’ అంటూ వచ్చేసిన బిగ్‌బాస్.. ఆదివారం ఘనంగా ఫస్ట్ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. అన్నీ రంగాల నుంచి ‘బిగ్‌బాస్‌ 4’ పార్టిసిపెంట్స్‌ ఎంపిక చేసి సెలబ్రిటీలను తయారు చేసింది. ఏ ఇద్దరి మధ్య కూడా సంబంధం లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందుకే ఈసారి ఎంటర్‌టైన్మెంట్‌ నెవర్‌ బిఫోర్‌ అంటున్నారు.



ఈసారి బిగ్‌బాస్‌లో 16మంది 1. మోనాల్ గజ్జర్ (హీరోయిన్), 2. సూర్య కిరణ్ (దర్శకుడు, నటి కళ్యాణి భర్త), 3. లాస్య (యాంకర్), 4. అభిజిత్ (‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ హీరో), 5. ‘జోర్దార్’ సుజాత (యాంకర్), 6. మెహబూబ్ దిల్‌సే (సోషల్ మీడియా సెన్సేషన్), 7. దేవి నాగవల్లి (న్యూస్ ప్రెజెంటర్), 8. దేత్తడి హారిక (యూట్యూబ్ స్టార్), 9. సయ్యద్ సోహైల్ (సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్), 10. అరియానా గ్లోరీ (యాంకర్, టిక్ టాక్ స్టార్), 11. అమ్మ రాజశేఖర్ (ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్), 12. కరాటే కళ్యాణి (నటి), 13. నోయల్ (నటుడు, ర్యాప్ సింగర్), 14. దివి (వెబ్ సిరీస్ నటి), 15. అఖిల్ సార్థక్ (టీవీ నటుడు), 16. గంగవ్వ (సోషల్ మీడియా స్టార్)



అయితే వీరందరిలో బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో రోజు కనిపించే, అందరికీ తెలిసిన మొఖం టీవీ9 దేవిదే. టీవీ9 న్యూస్ ఛానెల్‌లో యాంకర్ గా న్యూస్ రీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవి నాగవల్లి. టీవి9లో సీనియర్ యాంకర్‌గా ఉన్న ఆమె.. ఈసారి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి బిగ్ బాస్ 2 నుంచి ఆమెను హోస్‌లోకి తీసుకుని రావాలని నిర్వాహకులు ట్రై చేశారు. కానీ ఇప్పటికి ఆమె ఎంట్రీ ఇచ్చింది. కాంట్రవర్సీ షోలో ఆమె ఏ విధంగా ముందుకు సాగనుందనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది.




హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందే తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఆకట్టుకున్న దేవి.. రాజమండ్రిలో పుట్టి బికామ్ చదువుకున్నారు. గ్రాఫిక్స్ కోర్స్ అనంతరం ఛానెల్‌లో చేరారు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని ఆ తరువాత అమెరికా వెళ్లిన ఆమె.. అక్కడ 8 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేక విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆమెకు 6ఏళ్ల బాబు ఉన్నాడు.


బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంధర్భంగా ఆమె మాట్లాడతూ.. మంచి అమ్మాయి అనే సర్టిఫికెట్ కోసం నేను ఉండలేను. బిగ్ బాస్‌లో లేడి విన్నర్‌గా నిలవాలి అన్నదే నా కోరిక. కానీ బిగ్ బాస్ అంటే కొంచెం భయంగా కూడా ఉందని ఆమె అన్నారు. వచ్చిన జీతం హోమ్ లోన్ కట్టడానికి సరిపోతుందని, విన్నర్‌గా నిలిచి ప్రైజ్ మనీ కొట్టేయలని వచ్చినట్లు దేవి చెప్పుకొచ్చారు.




టెర్రర్ ఎటాక్ తర్వాత అమర్‌నాథ్ వెళ్లి డేరింగ్ రిపోర్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. కాశ్మీర్ అల్లర్ల సమయంలో గ్రౌండ్‌లోకి వెళ్లి రిపోర్టింగ్ చేశారు. 2009లో నేషనల్ టెలివిజన్ అవార్డు అందుకున్న తొలి తెలుగు ప్రెజెంటర్ దేవి.. 2009లో నంది అవార్డు 2010లో నంది అవార్డు కూడా ఆమె సొంతం చేసుకున్నారు. అయితే బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్శీకి కేరాఫ్‌.. ఈ కాంట్రవర్శీ గేమ్‌లో దేవి ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.




https://10tv.in/two-old-age-womens-dance-to-asha-bhosle-piya-tu-ab-toh-aajasong/
ఇక దేవి స్పెషల్ టాలెంట్స్ విషయానికి వస్తే, ఆమె తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. చర్చలలో బాగా వాదించగలదు. ప్రతి విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది. అంతేకాదు, భగవద్గీత ఫోటీల్లో ప్రతిభను చాటుకున్న వ్యక్తి దేవి. అవార్డులను కైవసం చేసుకుంది.