Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు పార్ట్ 2 పై నిధి అగర్వాల్ అప్డేట్.. పవన్ నుంచి ఇంకో సినిమా..

పవన్ ఫ్యాన్స్ లో అసలు హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉంటుందా? పవన్ మళ్ళీ డేట్స్ ఇస్తారా? అనే సందేహాలు నెలకొన్నాయి.

Hari Hara Veeramallu

Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అయిదేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు జులై 24న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే హరిహర వీరమల్లు సినిమాకు రెండు పార్టులు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు వచ్చేది హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్. అయితే పార్ట్ 2 పై అందరికి సందేహమే ఉంది. ప్రమోషన్స్ లో కూడా పార్ట్ 2 గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు.

పవన్ ఫ్యాన్స్ లో అసలు హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉంటుందా? పవన్ మళ్ళీ డేట్స్ ఇస్తారా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో నిధి అగర్వాల్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడింది.

Also Read : Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే..

నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు పార్ట్ 2 షూటింగ్ కూడా 20 శాతం పూర్తయింది. పార్ట్ 2లో కూడా నేను ఉంటాను. మిగిలిన షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో తెలీదు అని చెప్పుకొచ్చింది.

దీంతో హరిహర వీరమల్లు పార్ట్ 1 పెద్ద హిట్ అయి మంచి లాభాలు వస్తే పార్ట్ 2 గురించి ఆలోచిస్తారని తెలుస్తుంది. ఒకవేళ పార్ట్ 2 ఉంటె పవన్ చేతిలో ఉన్న OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల తర్వాత పవన్ కుదిరినప్పుడు డేట్స్ ఇచ్చి హరిహర వీరమల్లు పార్ట్ 2 సినిమాని 2027 వరకు లేదా ఎన్నికల ముందు తీసుకొచ్చే ప్లాన్ చేస్తారని టాలీవుడ్ టాక్. మరి హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉందా లేదా అనేది నిర్మాత, దర్శకులు రిలీజ్ అయ్యాక అయినా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : Prabhas -Rana : బాహుబలిని చంపుతాను అన్న రానా.. ప్రభాస్ ఏమన్నాడో తెలుసా..? ప్రభాస్ పోస్ట్ వైరల్..