Nidhhi Agerwal : పవన్‌తో నిధి అగర్వాల్.. హరిహర వీరమల్లు లవ్ స్టోరీపై నిధి కామెంట్స్.. త్వరలో పవన్ తో సెల్ఫీ..

తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటిస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది నిధి.

Nidhhi Agerwal Shares HariHara VeeraMallu Content and Comments on Pawan Kalyan goes Viral

Nidhhi Agerwal : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని పూర్తిచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఓ పక్క తన ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీగా ఉంటూనే మరో పక్క సినిమా షూటింగ్ చేస్తున్నారు. భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా కోసం నిధి ఆల్మోస్ట్ చాలా సినిమాలు వదిలేసుకుంది అని సమాచారం. పవన్ డేట్స్ ని బట్టి ఈ సినిమా షూట్ జరుగుతుండటంతో నిధి వేరే సినిమాలు ఒప్పుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సినిమాకు డేట్స్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటిస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది నిధి.

Also Read : Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ కూడా రెడీ.. షూటింగ్ సెట్స్ నుంచి బాలయ్య ఫోటో వైరల్..

ఈ క్రమంలో ఓ నెటిజన్ హరిహర వీరమల్లు సినిమాలో ఏదైనా లవ్ ట్రాక్ ఉందా అని అడగ్గా వీర, పంచమిల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది అని చెప్పింది. దీంతో పవన్ కళ్యాణ్ వీర పాత్ర – నిధి అగర్వాల్ పంచమి పాత్ర మధ్య ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

అలాగే నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నల్లో పంచమి పాత్రను బాగా రాసారని, ఎవరూ ఊహించలేని పాత్ర అని చెప్పింది. పవన్ కళ్యాణ్ గురించి ఓ రేంజ్ లో పొగిడింది. అలాగే నిన్న షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నాను అని త్వరలోనే ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని తెలిపింది. దీంతో నిధి కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక హరిహర వీరమల్లు సినిమా మార్చ్ 28న రిలీజ్ కానుంది.