Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ కూడా రెడీ.. షూటింగ్ సెట్స్ నుంచి బాలయ్య ఫోటో వైరల్..
తాజాగా డాకు మహారాజ్ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది.

Balakrishna Daaku Maharaaj Movie Shoot Completed Ready to Race in Sankranthi
Daaku Maharaaj : ఈ సంక్రాంతి బరిలో బాలకృష్ణ కూడా ఉన్న సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య జనవరి 12న థియేటర్స్ లోకి రాబోతున్నాడు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య ఈ సినిమాతో ఆ హిట్స్ ని కంటిన్యూ చెయ్యబోతున్నాడు. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో గ్రాండ్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా.
Also Read : Pushpa 2 Journey : సుక్కు, బన్నీ, రష్మిక, తబిత.. అందరూ ఎమోషనల్.. పుష్ప అయిదేళ్ల జర్నీ ముగుస్తుండటంతో..
ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసి హైప్ ఇచ్చారు. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా డాకు మహారాజ్ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. నేటితో డాకు మహారాజ్ షూటింగ్ పూర్తయిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా షూటింగ్ సెట్స్ నుంచి బాలకృష్ణ, బాబీ ఉన్న ఓ వర్కింగ్ స్టైల్ ని షేర్ చేసారు.
డాకు మహారాజ్ షూట్ కూడా అయిపోవడంతో శరవేగంగా సంక్రాంతి బరిలోకి ఈ సినిమా సిద్ధం కానుంది. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్స్ డిసెంబర్ చివరికల్లా పూర్తిచేసి డిసెంబర్ చివరి వారం నుంచి ప్రమోషన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.